pawan and BJP made chandrababu CM పవన్, బీజేపి వల్లే చంద్రబాబుకు సీఎం సీటు..

Chanadrababu became cm only with support of pawan and bjp

andhra pradesh special status, TDP, chandrababu, vishnu kumar raju, JanaSena, corruption, JSP Factfingdin commitee, andhra pradesh, politics

After Andhra pradesh ruling party TDP departing from NDA and the central government, bjp vishnu kumar raju alleges that chandrababu becamr CM of the state with the only support of JanaSena president pawan Kalyan and BJP.

పవన్, బీజేపి వల్లే చంద్రబాబుకు సీఎం సీటు..

Posted: 03/19/2018 08:45 AM IST
Chanadrababu became cm only with support of pawan and bjp

రాష్ట్ర విభజన జరిగిన తరువాత నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ పార్టీ అధికారంలో కి రావడానికి కారణం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాన్ మధ్దతు తో పాటు తమ పార్టీలో పెట్టుకున్న పొత్తే కారణమని.. విశాఖ ఉత్తర ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు అన్నారు. బీజేపీతో పొత్తు లేకపోయినా..  పవన్ కల్యాన్ మద్దతు ఇవ్వకపోయినా టీడీపీ అధికారానికి దూరమయ్యూదని, అసలు చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేవారే కాదని ఆయన పేర్కోన్నారు.

చంద్రబాబు మరోసారి ప్రతిపక్షంలో కూర్చుని ఉండేవారని అన్నారు. చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చూంటే ఎంతటి అసహనం కనబర్చేవారో అందరికీ తెలసునని, డాక్టర్ వైఎస్ సహా రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాల హాయాంలో ఆయన చెప్పిన మాటలు, ప్రభుత్వాలపై అయన చేసిన తిరుగుబాటు.. తొమ్మిదేళ్లు సీఎం గా చేశానని చెప్పిన అధికారులతో వాదించిన అయన అహంకార ధోరణి అన్ని స్పష్టంగా ప్రజలు చూశారని, అయితే బీజేపితో పొత్తుతో పాటు పవన్ ప్రచారమే ఆయనకు గత ఎన్నికల్లో మేలు చేసిందని ఆయనకు కూడా తెలుసునని, అయినా దానిని తెరపై కనిపించనీయకుండా.. అంతా తన క్రెడిట్ గానే చెప్పుకోవడం చంద్రబాబు నైజమని విష్ణుకుమార్ రాజు పేర్కోన్నారు.

 టీడీపీ తమకు మిత్రపక్షం కాబట్టే ఇప్పటి వరకు సంయమనంతో వ్యవహరించామని, ఇకపై అలా ఉండదని తేల్చి చెప్పారు. ప్రజా సమస్యలపై తమ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. విశాఖపట్టణంలో జరిగిన భూ కుంభకోణాలు వెలుగులోకి రావడానికి కారణం తానేనన్నారు. తనవల్లే ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటైందన్నారు. టీడీపీ నేతల అవినీతి బాగా పెరిగిందని ఆరోపించారు. ఇకపై రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్ష పాత్రను పోషిస్తుందని అన్నారు. విశాఖపట్టణం రైల్వే జోన్‌పై మాట్లాడుతూ.. రైల్వే జోన్ తప్పకుండా వచ్చి తీరుతుందని విష్ణుకుమార్ రాజు విశ్వాసం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles