Raj Thackeray calls for 'Modi-mukt Bharat' ప్రధాని ముక్త్ భారత్ కోసం ప్రతిపక్షాలన్నీ ఏకంకావాలి

Raj thackeray calls for modi mukt bharat

Raj Thackeray, Narendra Modi, Maharashtra Navnirman Sena, BJP, Akshay Kumar, 'Modi-mukt Bharat', LK Advani, opposition parties, emergency, freedom, modi mukth bharat freedoom, politics

Launching a scathing attack on the BJP-led NDA government, Maharashtra Navnirman Sena (MNS) chief Raj Thackeray on Sunday called for opposition unity and a "Modi-mukt Bharat" by 2019.

ప్రధాని మోడీపై రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు

Posted: 03/19/2018 07:49 AM IST
Raj thackeray calls for modi mukt bharat

2019 ఎన్నికల్లో దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని దీంతోనే దేశానికి మూడో పర్యారం స్వాతంత్ర్యం కోసం పోరాడాల్సిన అవసరముందని మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాకరే వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్లుగానే కాంగ్రెస్ ముక్త్ భారత్ ను గుర్తు చేసిన రాజ్ ధాకరే అదే విధంగా దేశంలో ప్రస్తుతం మోడీ ముక్త్ భారత్ అవసరముందని అన్నాడు. నరేంద్రమోడీ పాలన నుంచి భారతావనికి విముక్తి కలిగించేందుకు విపక్షాలన్నీ ఏకం కావాలని  బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని ఆరోపించారు.

2019 సార్వత్రిక ఎన్నికలలో 'మోదీ ముక్త్ భారత్' తన లక్ష్యమని, ఇందుకు అన్ని రాజకీయపక్షాలు తనతో కలవాలని కోరారు. నరేంద్ర మోదీ తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మభ్య పెడుతున్నారని ముంబైలోని శివాజీ పార్క్ లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన అరోపించారు. ప్రధాని మోడీ మాటలు కోటలు దాటుతున్నాయని, కానీ ఆయన అభివృద్ది మాత్రం కనీసం గడప దాటడం లేదని దుయ్యబట్టారు.

దేశస్వాత్రంత్యం కోసం మహానీయులు పోరాటాల ఫలితంగా 1947లో స్వాతంత్ర్యం వచ్చిందని, ఆపై 1977లో (ఎమర్జెన్సీ) అత్యవసర పరిస్థితుల తరువాత జరిగిన ఎన్నికల్లో ఇంకోసారి స్వాతంత్ర్యం వచ్చిందని, ఇక 2019లో మోదీ నుంచి ప్రజలకు ముక్తిని కలిగించడం ద్వారా మూడోసారి స్వాతంత్ర్యం వస్తుందని రాజ్ ధాకరే అభిప్రాయపడ్డారు. మోడీ పాలనలో కేవలం పారిశ్రామిక వేత్తలు మాత్రమే సుఖంగా వున్నారని, మిగిలిని అన్ని వర్గాల వారు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారని విమర్శించారు.

ప్రధాని నరేంద్రమోడీ తాను అవినీతి రహిత పాలన చేస్తున్నానన్నని ప్రగల్భాలు పలుకుతున్నారని, కానీ పెద్ద నోట్ల రద్దుపై విచారణ జరిపిస్తే, స్వతంత్ర భారతావనిలో అతిపెద్ద కుంభకోణం అవుతుందని అరోపించారు. ఇది చాలదన్నట్లు తన అనుయాయువడైన బీజేపి జాతీయ అధ్యక్షుడి కుమారుడు జైషా అవినీతి కేసును కూడా పక్కదారి పట్టించారని అరోపించారు. మహారాష్ట్రలో భూగర్భ జలాలు చాలా వేగంగా అడుగంటి పోతున్నాయని ఇస్రో ఇచ్చిన నివేదికను ప్రస్తావించిన ఆయన, సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు.

రాజ్ థాకరే ఇచ్చిన పిలుపు ముంబైని షేక్ చేస్తోంది. ఆయన ఇచ్చిన పిలుపుతో పార్టీ కార్యకర్తలు గుజరాతీలపై దాడులకు పాల్పడుతున్నారు. బై-అహ్మదాబాద్ హైవేపై ఉన్న దాబాలపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు. షాపుల సైన్ బోర్డును ధ్వంసం చేశారు. గుజరాతీల ఆస్తులపై ఎంఎన్ఎస్ కార్యకర్తలు దాడులు చేయడం ఇదే తొలిసారి కాదు. గత ఏడాది జులైలో కూడా ముంబై, దాదర్ లలో దాడులు చేశారు. ప్రస్తుతం నెలకొన్న పరిణామాలతో ముంబైలోని గుజరాతీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.  

ఇక అదే క్రమంలో రాజ్ థాకరే అటు దివంగత నటి, శ్రీదేవి సహా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భారతీయుడు కాదని రాజ్ ఠాక్రే సంచలన ఆరోపణలు చేశారు. అక్షయ్ కుమార్ పాస్ పోర్ట్ లో కెనడియన్ గా ఉందని అన్నారు. వికీపీడియా కూడా ఆయన భారత్ లో పుట్టిన కెనడియన్ గానే పేర్కోని వుందని తెలిపారు. ఒకప్పటి నటుడు మనోజ్ కుమార్ అడుగుజాడల్లో అక్షయ్ కుమార్ నడిచే ప్రయత్నం చేస్తున్నాడని రాజ్ ఠాక్రే విమర్శించారు.

సినీ నటి శ్రీదేవి దేశానికి ఏం సేవ చేసిందని ఆమె భౌతికాయంపై జాతీయ పతాకాన్ని ఉంచారని ఆయన కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రీదేవి అంత్యక్రియులు అధికార లాంఛనాలతో జరిపించడానికి గల కారణం ఏంటని నిలదీశారు. శ్రీదేవి విషయంలో మీరు వ్యహరించిన తీరు ఇతర పార్టీల నేతలు వ్యవహరించి వుంటే.. మీరు మౌనంగా వుండేవారా.? అని ప్రశ్నించారు. మీరు చేసే చర్యల్లోనే మీకు ఓ న్యాయం వుంటే మరోకరికి మరో న్యాయమా.? అని ప్రశ్నించారు. ఇక పనిలో పనిగా మీడియాపై కూడా ఆయన ఫైర్ అయ్యారు. బీజేపియేతర పార్టీలు ఇలా వ్యవహరించివుంటే మీడియా కూడా గగ్గోలు పెట్టి ఉండేదని, మోదీ పట్ల ఉన్న భయంతోనే మీడియా మౌనం వహించిందని ఆయన విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles