PM Speaks To Chandrababu Naidu, 2 Ministers Resign సీఎంకు పీఎం ఫోన్.. అయిననూ రాజీనామాలు చేసి రావలె..

Pm speaks to chandrababu naidu 2 ministers resign

Bharatiya Janata Party, National Democratic Alliance, step-motherly treatment to AP, Telugu Desam Party ministers, Ashok Gajapathi Raju, Y S Chaudhary, union ministers resignation, Union cabinet, PM Modi, Special Status to AP, Andhra Pradesh, Politics

PM Modi spoke to Andhra Pradesh Chief Minister Chandrababu Naidu, who, during the 10-minute conversation, formally conveyed the TDP's decision to pull out its two ministers over its demand for "special status" for the state.

సీఎంకు పీఎం ఫోన్.. అయిననూ రాజీనామాలు చేసి రావలె..

Posted: 03/08/2018 07:11 PM IST
Pm speaks to chandrababu naidu 2 ministers resign

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించేలేమని కేంద్ర అర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టంగా వెల్లడించిన నేపథ్యంలో ఇటు రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. అంతేకాదు కీలక పరిణామాలు కూడా చోటుచేసుకుంటున్నాయి, ఉదయం ఏపీ అసెంబ్లీలో బడ్జెజ్ సమావేశాలకు ముందుకు బీజేపి మంత్రులు మాణిక్యాల రావు, కామినేనిలు తమ రాజీనామాలను సీఎం చంద్రబాబుకు సమర్పించారు. ఆనంతరం సభలో యనమల రామకృష్ఱుడు తమ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడని విపక్షంతో పాటు ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్న క్రమంలోనే ఉదయం నుంచి పలు సంకేతాలు ఇచ్చిన కేంద్రమంత్రులు ఎట్టకేలకు సాయంత్రం తమ పదవులకు రాజీనామా చేశారు.

అంతకుముందు మంత్రిపదవులకు రాజీనామా చేసిన కామినేని నేతృత్వంలోని బీజేపి బృందం బ్లేమ్ గేమ్ కు ప్లాన్ రెడీ చేసింది. తన అధ్వర్యంలో నిర్వహించిన వైద్య శాఖకు మరీ ముఖ్యంగా ఎయిమ్స్ అసుపత్రి నిర్మాణ పనులను సమీక్షించారు. ఎయిమ్స్ నిర్మాణానికి కేంద్రం విడుదల చేసిన నిధులు ఎన్ని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల మంజూరు చేసిన నిధులెన్ని..? అన్న విషయమై సమీక్షించే పనిని చేపట్టారు. అయితే పదవిలో వుండగా, తానే స్వయంగా వ్యవహరించిన వైద్య శాఖకు చెందిన పనులను పరిశీలించడం.. రాష్ట్ర ప్రభుత్వంపై కావాలనే బురదజల్లే ప్రయత్నంలో భాగమన్న విమర్శలు వచ్చాయి. కావాలనే బీజేపి రివర్స్ గేమ్ అడుదేందుకు ప్రయత్నాలు చేస్తుందని అరోపణలు కూడా వినిపించాయి.

అయితే ఏపీకి ప్రత్యేక హోదా కల్పించలేమని తేల్చిచెప్పిన నేపథ్యంతో తమ కేంద్రమంత్రుల రాజీనామాలకు సంబంధించిన అంశమై ఫోన్ ద్వారా మాట్లాడేందుకు ప్రయత్నించిన చంద్రబాబుకు ప్రధాని కార్యాలయం నుంచి అందుకు తగిన స్పందన లభించలేదని స్వయంగా తానే ప్రకటించారు చంద్రబాబు. ఈ క్రమంలో ఇవాళ స్వయంగా ప్రధాని నరేంద్రమోడీ.. సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి మాట్లాడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తాజా రాజకీయ పరిణామాలపై వీరిద్దరూ సుమారు 20 నిమిషాల పాటు మాట్లాడినట్టు సమాచారం. రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చకపోవడంతో కేంద్ర కేబినెట్‌లో ఉన్న తమ ఇద్దరి మంత్రులను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని దృష్టికి మరోమారు సీఎం చంద్రబాబు తీసుకువచ్చారు.

ఈ సంబాషణ ముగిసీ ముగియంగానే అప్పటి వరకు ప్రధాని అపాయింట్ మెంట్ కోసం నిరీక్షించిన కేంద్రమంత్రులు సుజనా చౌదరీ, అశోక్ గజపతి రాజులకు ప్రధాని కార్యాలయం నుంచి ఫోన్ వచ్చింది. దీంతో అశోక్ గజపతి రాజు.. సుజనా చౌదరి నివాసానికి వెళ్లి తమ ప్రైవేటు వాహనాల్లో ప్రధాని నివాసానికి వెళ్లారు. ప్రధానితో భేటీ అయిన తరువాత వారు తమ రాజీనామాలను అయనకు సమర్పించారు. అయితే అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాము ఎన్డీయేలో కొనసాగుతున్నామని, కేంద్రమంత్రుల కన్నా ఎంపీలుగా రాష్ట్రం కోసం పాటుపడటమే తమ కర్తవ్యమని అన్నారు. ఇక ప్రధాని ఆంద్రప్రదేశ్ కు న్యాయం చేస్తామని హామిని ఇచ్చారని అశాభావం వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles