Two TDP Ministers Resign From Union Cabinet కేంద్రమంత్రి పదవులకు అశోక్ గజపతి. సుజనా గుడ్ బై

Two tdp ministers resign from union cabinet after meeting pm narendra modi

Bharatiya Janata Party, National Democratic Alliance, step-motherly treatment to AP, Telugu Desam Party ministers, Ashok Gajapathi Raju, Y S Chaudhary, union ministers resignation, Union cabinet, PM Modi, Special Status to AP, Andhra Pradesh, Politics

After alleging BJP led NDA of step-motherly treatment to Andhra Pradesh, two Telugu Desam Party minister Ashok Gajapathi Raju and Y S Chaudhary resigned from the Union cabinet.

కేంద్రమంత్రి పదవులకు అశోక్ గజపతి, సుజనా గుడ్ బై

Posted: 03/08/2018 06:20 PM IST
Two tdp ministers resign from union cabinet after meeting pm narendra modi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంలో తమపై సవతి తల్లి ప్రేమను కనబరుస్తున్నారని అరోపిస్తూ.. కేంద్రం నుంచి తెగదెంపులు చేసుకునేందుకు సిద్దమైన టీడీపీ పార్టీ ఎన్డీయేలో మాత్రం కొనసాగుతామని స్పష్టం చేసిన నేపథ్యంలో ఉదయం నుంచి రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ సాయంత్రం టీడీపీకి చెందిన కేంద్రమంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరీలు తమ పదవులకు రాజీనామా చేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోడీని కలసిన తరువాత వారు ఆయనకు తమ రాజీనామాలను సమర్పించారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్ నేపథ్యంలో తమ అధినేత చంద్రబాబు అదేశాల మేరకు తాము రాజీనామా చేసినట్లు కేంద్రమంత్రులు అనంతరం మీడియా సమావేశంలో చెప్పారు. అశోక్ గజపతి రాజు పౌర విమానాయాన శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించగా, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రిగా సుజనా చౌదరి పనిచేసిన విషయం తెలిసిందే. 2014 మే 26న అశోక్ గజపతి రాజు కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించగా, 2014 నవంబర్ 9న సుజనా చౌదరి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ రోజు ఉదయమే రాజీనామా లేఖలు సమర్పించాలని నిర్ణయం తీసుకున్న ఇరువురు నేతలు... మోదీ అందుబాటులో లేకపోవడంతో కాస్త ఆలస్యంగా రాజీనామా లేఖలను సమర్పించారు.  

గత నాలుగేళ్లుగా రాష్ట్రానికి కేంద్రం న్యాయం చేస్తుందని అశగా ఎదురుచూశామని చెప్పారు. అయితే కేంద్రం ఈ విషయంలో క్లారిటీ ఇవ్వకపోవడం.. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం హమీలను నిలబెట్టుకోవాల్సిన అవసరం, బాద్యత కేంద్రపై వుందని అన్నారు. చివరకు ప్రజల సెంటిమెంటుకు ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను ఇచ్చిన తమ పార్టీ.. తమను పదవులకు రాజీనామా చేయాలని అదేశించిన నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. తాము పదవుల్లో వున్నప్పుడు రాష్ట్ర అభ్యున్నతికి శాయశక్తులా కృషి చేయడంతో పాటు తమ బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తించామని కేంద్రమంత్రులు చెప్పారు.

రాష్ట్రానికి కేంద్రం తప్పనిసరిగా న్యాయం చేయాల్సిందేనని, దీనికి ఎవరి దయాబిక్షంతో పనిలేదని కేంద్రమంత్రులు అన్నారు. అయితే ఎన్డీయేలో భాగస్వామిగా కొనసాగుతామని స్పష్టం చేసిన కేంద్రమంత్రులు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం నిత్యం శ్రమిస్తునే వుంటామని, రాష్ట్రం కోసం కేంద్రమంత్రులుగా కన్నా ఎంపీలుగానే ఎక్కువ పోరాటం చేయగలమన్న నమ్మకం తమకుందని అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ అబివృద్దికి ప్రధాని సహకరిస్తారని అశిస్తున్నామని కేంద్రమంత్రులు అశాభావం వ్యక్తం చేయడం కొసమెరుపు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles