No Special Status for Any State in India | సెంటిమెంట్లు ఫండ్లు నిర్ణయించలేవ్.. హోదా ఇవ్వలేం : అరుణ్ జైట్లీ

Arjun jaitley on ap special status

Andhra Pradesh, Special Status, Arun Jaitley, Jaitley Press Conference, BJP-TDP Alliance, No Special Status India

Finance Minister Arun Jaitley on Wednesday reached out to Andhra Pradesh CM Chandrababu Naidu and said that the Centre will stand by all its commitments regarding the funds that were promised to the state after the bifurcation. However, he also added that “sentiments do not define the quantum of funds” as the Centre has to look at a number of things. Jaitley’s statement comes close on the heels of TDP hinting at severing its ties with the NDA. TDP is an alliance partner in both the Centre and Andhra Pradesh.

ప్రస్తుతం ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా లేదు

Posted: 03/07/2018 06:18 PM IST
Arjun jaitley on ap special status

ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ పెరుగుతోన్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. ఏపీ విభజన హామీల అశంపై ఢిల్లీలో కేంద్ర మంత్రి సుజనా చౌదరితోనూ గంటసేపు చర్చించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన వివరణ ఇచ్చారు.

జీఎస్టీ రాబడి కేంద్ర, రాష్ట్రాలకు పంపిణీ జరుగుతుందని అన్నారు. తగినంత రాబడి లేకపోవడం వల్లే ఈశాన్య రాష్ట్రాలకు గతంలో ప్రత్యేక హోదా ఇచ్చారని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలకు 90:10 నిష్పత్తిలో నిధుల పంపిణీ జరుగుతోందని వివరించారు. 14వ ఆర్థిక సంఘం ఏ రాష్ట్రానికి కూడా హోదా ఇవ్వకూడదని తెలిపిందని.. ప్రస్తుతం ఏ రాష్ట్రానికి కూడా హోదా లేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ నేతలు, చంద్రబాబు నాయుడు విజ్నప్తులను తాము అర్థం చేసుకున్నామని.. కానీ, సెంటిమెంట్లతో ఇలాంటి వ్యవహారాలు సాధించుకోలేరని ఆయన హితవు పలికారు.

కొన్ని పరిణామాల వల్ల ప్రత్యేక హోదా అనే విధానమే మనుగడలో లేకుండా పోయిందని జైట్లీ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజలకు ఇష్టం లేకుండానే రాష్ట్ర విభజన జరిగిందని, ఆ సమయంలో ఏపీకి రెవెన్యూ లోటు పూడ్చాలని విభజన చట్టంలో ఉందని అన్నారు. ప్రతీ ఐదేళ్ల కోకసారి పన్నేతర సాయం రాష్ట్రాలకు అందిస్తామని.. నిధుల లేమితో బాధపడుతున్న ఏపీకి సాయం చేస్తామని చెప్పారు. ఏపీ తీసుకునే విదేశీ రుణాల్లో 90 శాతం కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని తెలిపారు. విదేశీ సంస్థల ద్వారా కాకుండా నాబార్డ్ ద్వారా నిధులను ఇవ్వాలని ఏపీ కోరింది. దీని వల్ల రుణ పరిమితి తగ్గుతుందని తెలిపారు.

ఐదేళ్లపాటు 90 శాతం రుణాలను కేంద్రం భరిస్తుంది. హోదా వల్ల పథకాల్లో కేంద్రం వాటా 90శాతం ఉంటే.. రాష్ట్రం 10 శాతం భరిస్తుంది. ఆ లెక్కన ఏపీకి ప్రత్యేక హోదా కాకుండా కేవలం ప్యాకేజీత సరిపెట్టబోతున్నామన్న విషయాన్ని జైట్లీ కుండబద్ధలు కొట్టేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles