North East Assembly Election results Counting Begins | మొదలైన త్రిపుర, మేఘాలయా, నాగాలాండ్ కౌంటింగ్.. గెలుపెవరిదో మధ్యాహ్నం కల్లా తేలిపోతుంది

Telugu content

North East States, Tripura Results, Meghalaya Results, Nagaland Results, Election Results, Election Commission, BJP, CPI

Tripura, Meghalaya And Nagaland Election Results. Close Battles In The 3 North East States.

కొనసాగుతున్న ఈశాన్య రాష్ట్రాల ఓట్ల లెక్కింపు

Posted: 03/03/2018 09:44 AM IST
Telugu content

ఈశాన్య రాష్ట్రాలైన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వీటి ఫలితాల కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. శనివారం ఓట్ల లెక్కింపు సందర్భంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల సంఘం తెలిపింది. కౌంటింగ్ హాల్స్ వద్ద కేంద్ర బలగాలను మోహరించినట్టు త్రిపుర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) శ్రీరామ్ తరణికాంత తెలిపారు.

త్రిపురలో గతనెల 18న ఎన్నికలు జరగ్గా, నాగాలాండ్, మేఘాలయలో ఫిబ్రవరి 27 న ఎన్నికలు జరిగాయి. మూడు రాష్ట్రాల్లో గెలుపుపై ప్రధాన పార్టీలన్నీ ధీమాగా ఉన్నాయి. ఎవరికి వారే గెలుపుపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ గాలి బలంగా వీస్తోందని ఎగ్జిట్ పోల్స్ చెప్పుకొచ్చాయి. త్రిపురలో 25 ఏళ్ల వామపక్ష ప్రభుత్వాన్ని గద్దె దింపడం ఖాయమని పేర్కొన్నాయి. మిగత రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ తన స్థానాన్ని నిలబెట్టుకుంటుందని జోస్యం చెప్పాయి.

మేఘాలయలో కాంగ్రెస్ పదేళ్లుగా అధికారంలో ఉంది. నాగాలాండ్‌లో మూడు నెలల రాష్ట్రపతి పాలన మినహా 2003 నుంచి నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్‌పీఎఫ్) అధికారాన్ని చలాయిస్తోంది. అసోం, మణిపూర్, అరుణాచల్‌ప్రదేశ్‌లో ఇప్పటికే బీజేపీ పాగా వేయగా ఈ ఎన్నికల ద్వారా మిగతా ఈశాన్య రాష్ట్రాల్లోనూ విస్తరించాలని బీజేపీ పట్టుదలతో ఉండగా, తమ పట్టును సడలించకూడదని కాంగ్రెస్, వామపక్ష పార్టీలు భావిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles