Accused Right Wing Leader Name for Padma Shri | అన్నేసి కేసులు ఉన్నాయి.. అయినా పద్మశ్రీకి ఎలా సిఫార్సు చేశారు?

Maharashtra govt recommended accused for padma shri

Maharashtra, Bhima-Koregaon Clash, Sambhaji Bhide, RTI Act, Padma Shri Award, Devendra Fadnavis

Maharashtra Governemt recommended Bhima-Koregaon clash accused Sambhaji Bhide to Padma Shri. The relevant documents were obtained by HT from the state government’s protocol department under the Right To Information Act.

కేసులుండగా ‘పద్మశ్రీ’ కి ఎలా?

Posted: 03/03/2018 09:24 AM IST
Maharashtra govt recommended accused for padma shri

మొన్నీ మధ్య మహారాష్ట్రలో వర్ణ పోరు జరిగిన విషయం తెలిసిందే. భీమా-కొరెగావ్ అల్లర్లతో రాష్ట్రం అట్టుడుకిపోయింది. రైట్ వింగ్ నేత మనోహర్ అలియాస్ శాంభాజీ భిడే ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అయితే ఆయన పేరును మహారాష్ట్ర ప్రభుత్వం ‘పద్మ’ అవార్డు కోసం సిఫారసు చేయడం చర్చనీయాంశమైంది.

పదిమంది సీనియర్ మంత్రులతో కూడిన హైపవర్ కమిటీ 2016లోనే భిడేను ‘పద్మశ్రీ’ అవార్డు కోసం సిఫారసు చేస్తూ నిర్ణయం తీసుకుంది. సమాచార హక్కు చట్టం కింద ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సంగిలికి చెందిన 84 ఏళ్ల భిడే అలియాస్ భిడే గురూజీ తొలి నుంచీ వివాదాస్పద నేత. మేవార్ సైన్యానికి నివాళులు అర్పించేందుకు వచ్చిన దళితులపై దాడి చేసిన కేసులో భిడేతోపాటు రైట్ వింగ్‌కు చెందిన మరో నేత మిలింద్ ఎక్బోటేపై ఎఫ్ఐఆర్ నమోదైంది.

సంగ్లి జిల్లాలోని మిరాజ్-సంగ్లిలో జరిగిన గణపతి నిమజ్జనోత్సవంలో మత ఘర్షణలు రేకెత్తించారంటూ భిడేపై మరో కేసు కూడా ఉంది. 2008లో ‘జోధా-అక్బర్’ సినిమా విడుదలను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలో థియేటర్లను దోచుకున్న కేసు కూడా అతడిపై నమోదైంది. ఇన్ని కేసులు ఉన్న ఓ నిందితుడిని ‘పద్మశ్రీ’ పౌర పురస్కారానికి సిఫారసు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్ఎస్సెస్ మాజీ కార్యకర్త అయిన భిడేపై 2008 నుంచి కేసులు ఉన్నాయని అంబేద్కర్ మనవడు ప్రకాశ్ తెలిపారు. అలాంటి వ్యక్తిని కాంగ్రెస్ హయాంలో ఉండగా అరెస్ట్ చేయించలేకపోయిందని.. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇలా గౌరవ పురస్కారాలకు సిఫార్సు చేయటం దారుణమని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles