Punjab Village Reflects Unity in Diversity | మసీదు కోసం బ్రహ్మణుల భూమి.. సిక్కుల సాయం

Brahmins donate land for masjid in punjab

Brahmins, Punjab Village, Moom, Sikhs, Masjid Construction, Unity in Diversity

Brahmins Donate Land to Masjid in Punjab. in Moom Village while Sikhs Donate Money and Physical Help to Construction of Muslim Holy Built.

మత సామరస్యానికి ప్రతీక.. ఈ గ్రామం

Posted: 02/28/2018 01:10 PM IST
Brahmins donate land for masjid in punjab

ఓవైపు మత ఛాందస వాదుల వ్యవహారాలు .. మత ఘర్షణలు, లవ్ జిహాదీల వ్యవహారాలు వార్తల్లో నిలుస్తున్న వేళ.. మసీదు కోసం బ్రాహ్మణులు స్థలం దానం చేసిన ఘటన పంజాబ్ లో చోటు చేసుకుంది. పంజాబ్‌లోని బర్నాలా జిల్లా, మూమ్ గ్రామంలో ఈ అద్భుతమైన మత సామరస్య దృశ్యం గోచరిస్తోంది.

ఇంకో విశేషం ఏంటంటే.. దాని నిర్మాణానికి సిక్కులు డబ్బులు సమకూర్చారు. అంతేకాదు ఆ రెండు మతస్థులు మసీదు నిర్మాణానికి శ్రమదానం కూడా చేస్తున్నారు. మసీదు నిర్మాణ పనులను దగ్గరుండి చూసుకుంటున్న 40 ఏళ్ల నజీమ్ ఖాన్ మాట్లాడుతూ..."ఇప్పటివరకు, మా గ్రామంలోని బాబా మొమిన్ షా మందిరంలోపల ఉన్న రెండు గదుల్లో ప్రార్థనలు చేస్తున్నాం. పండిట్ బిరదారీ కొంత స్థలాన్ని మసీదు కోసం దానం చేయడంతో మేము నిర్మాణాన్ని మొదలుపెట్టాం. వారు స్థలాన్ని ఇవ్వడమే కాకుండా మసీదు నిర్మాణానికి తమ వంతుగా శ్రమదానం చేస్తున్నారు. డబ్బులు కూడా సమకూర్చుతున్నారు" అని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

Brahmins Donates Land to Masjid

ఇక మసీదు నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తున్న సదరు గ్రామంలో ఆయుర్వేద వైద్యుడుగా పనిచేస్తున్న పండిట్ పురుషోత్తం లాల్ మాట్లాడుతూ.. ఓ పంజాబీగా, తమకు సంబంధించినంత వరకు మతాలకు అతీతంగా అందరూ సమానమేనని ఆయన అన్నారు. రాజకీయ నేతలు ఓట్ల కోసం మతాలు, కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుంటారని, కానీ తాము వారి వలలో పడబోమని మూమ్ గ్రామస్థుడొకరు స్పష్టం చేశాడు. దాదాపు 300 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఈ గ్రామానికి శాంతియుత జీవనం, మత సామరస్యత పరంగా గొప్ప చరిత్ర, పేరు ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles