Chandrababu Still Unhappy with BJP | బీజేపీపై అసంతృప్తి వెల్లగక్కిన సీఎం చంద్రబాబు.. గొడవలు చేస్తే నష్టమే!

Chandrababu comments on bjp congress

Chandrababu Naidu, CII Partnership Summit, BJP, AP Special Status, BJP Chandrababu

AP CM Chandrababu Naidu Fires on Opposition over Comments on CII Partnership Summit.

రానున్న ఎన్నికల్లో ఏమైనా జరగొచ్చు

Posted: 02/28/2018 10:59 AM IST
Chandrababu comments on bjp congress

స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోటి నుంచి వెలువడిన మాటలు ఇవి. మిత్ర పక్షం-కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను ఉద్దేశించి ఆయన భాగస్వామ్య సదస్సులో ఈ వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగేలా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్నాయని అన్నారు.

దేశంలో ఎవరికైనా, ఏ రాష్ట్రానికైనా అన్యాయం జరిగితే... దేశంలోని ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లే బాధ్యత వహించాలని ఆయన అంటున్నారు. ఈ రెండు పార్టీలు బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే... దేశానికి మంచిది కాదన్నారు. ప్రత్యేక హోదా రాయితీలను ఇతర రాష్ట్రాలకు ఇచ్చినప్పుడు, ఏపీకి కూడా ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. స్వశక్తితో మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని, మన పని మనం చేసుకుంటూనే కేంద్రంతో పోరాటం చేయాలన్నారు. అనవసరంగా గొడవలు చేస్తే రాష్ట్రానికే నష్టమని చెప్పారు. నిర్మాణాత్మకంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులస్తుంటే ప్రత్యేక హోదా ఎందుకని బీజేపీ నేతలంటున్నారన్నారని సోము వీర్రాజు వ్యాఖ్యలను ఉటంకించారు.

పొత్తుల విషయంలో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమని.. రానున్న ఎన్నికల్లో ఏమైనా జరగొచ్చంటూ భవిష్యత్ రాజకీయాలపై పరోక్ష సంకేతాలను పంపించారు. ప్రత్యేక హోదాపై కలిసి పోరాడదామన్న విపక్షాల మాటలను పెడ చెవిన పెడుతున్న చంద్రబాబు.. ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా నెపంను జాతీయ పార్టీల మీదకు నెట్టేస్తూ రాష్ట్రం క్రెడిబులిటీ దెబ్బతింటోందని వాదించటం ఎంత వరకు సబబని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles