SBI Wrote Off Rs 200 Billion Worth of Bad Loans సంపన్నుల రుణాలను మాఫీ చేసిన ఎస్.బి.ఐ

Sbi wrote off bad loans worth over rs 20000 crore last fiscal

SBI, written-off account, State Bank of India, non-performing assets, NPAs, Auca, accounts under collection accounts, Reserve Bank of India, Asutosh Kumar Mishra, Reliance Securities, Rajnish Kumar, bad loans, Reserve Bank, State Bank Of India, Bank of Baroda, SBI, Arun jailtely, bjp, PM Modi

The country's largest lender SBI wrote off bad loans worth Rs 20,339 crore in 2016-17, the highest among all the public sector banks, which had a collective write off of Rs 81,683 crore for the fiscal.

సంపన్నుల రుణాలను మాఫీ చేసిన ఎస్.బి.ఐ

Posted: 02/12/2018 10:22 AM IST
Sbi wrote off bad loans worth over rs 20000 crore last fiscal

సామాన్యుల పట్ల ఓ తీరున, ప్రముఖుల పట్ల మరో తీరున వ్యవహరిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మొండి బకాయిల కింద వేల కోట్ల రూపాయల రుణాలను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. మెండి బకాయిల ఊబిలో కూరుకుపోయిన దేశీ బ్యాంకింగ్ దిగ్గజం.. ఎస్బీఐ బ్యాలెన్స్ షీట్ ప్రక్షాలన పేరుతో భారీ మొత్తంలోనే రుణాలను రైటాప్ చేసింది. గతేడాది పీఎస్బీలు అన్ని కలిపి 81 వేల 683 కోట్ల రూపాయలను మాఫీ చేసింది.

కాగా, ఈ ఏడాది డిసెంబర్ నాటికి దాదాపుగా 20 వేల కోట్ల రూపాయలకు పైగానే రుణాలు మాఫీ అయ్యాయని అధికారిక గణంకాల్లో వెల్లడైంది. సామాన్యులు నుంచి ముక్కి పిండి మరీ రుణాల డబ్బులను వసూటు చేసే బ్యాంకులు.. అవసరమైతే వారి అస్తులను జప్తు చేసి.. వేలం వేసి.. ఇతరులకు విక్రయించైనా తమ డబ్బును జమ కట్టుకునే బ్యాంకులు అదే పాలసీని ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలపై చూపరు. ఏ ఏఢాదికా ఏడాది బ్యాంకులు వీరికి మాత్రం రుణాలను మాఫీ చేస్తూనే వున్నాయి. అసలు సామాన్యలుకు ఇంటి, వాహన రుణాలను అందించేందుకు అంక్షల మీద అంక్షలు పెట్టి అన్ని దస్తావేజులు పరిశీలించే బ్యాంకులు, వీరికి మాత్రం వేలు, వందల కోట్ల మేరు రుణాలను ఎలా ఇస్తున్నారన్నది అర్థంకాని ప్రశ్న.

సుమారు రూ.20,339 కోట్ల రుణాలను ఎగవేతదారులు చెల్లించలేదని బ్యాంకు రద్దు చేసింది. కాగా, ఎస్బీఐతో పాటు 2016-17 ఆర్థిక సంవత్సరంలో 81,683 కోట్ల మొండి బకాయిలను ఇతర బ్యాంకులు రద్దు చేశాయి. 2016-17 ఆర్థిక సంవత్సరంలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.9,205 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.7346 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.5,545 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.4348 కోట్ల బకాయిలను రద్దు చేశాయి. అసలు బ్యాంకుల్లో వున్న ప్రజాధనం మాఫీ చేసే అధికారం బ్యాంకులకు ఎవరిచ్చారని.. ఇలా చేస్తూనే.. ఖాతాదారులపై మాత్రం జరిమానాలు, ఫైన్ లు కట్టించుకుని.. ట్రాన్స్ యాక్షన్ల పరిమితిపై అంక్షలు తదితరాలు చేపడుతున్నారని సామాన్యులు గుసగుసలాడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bad loans  Reserve Bank  State Bank Of India  Bank of Baroda  SBI  Arun jailtely  bjp  PM Modi  

Other Articles