3.4 magnitude quake hit Maharashtra మహారాష్ట్రలోని సత్తారాలో కంపించిన భూమి

Earthquake measuring 3 4 on richter scale strikes maharashtra s satara

earth quake in maharastra, earth quake in satara, earth quake in konya, earth quake, tremours in satara, tremours in maharashtra, tremours in konya, earth quake, Maharashtra, satara, lunar eclipse, astrology, science and technology

An earthquake measuring 3.4 on the Richter scale struck Satara in Maharashtra during wee hours on Friday. No reports of casualty or damage were received till the time of filing this report.

మహారాష్ట్రలోని సత్తారాలో భూకంపం.. పక్షం రోజుల్లో రెండోసారి..

Posted: 02/02/2018 10:13 AM IST
Earthquake measuring 3 4 on richter scale strikes maharashtra s satara

మహారాష్ట్రలోని ఇవాళ మరోమారు భూమి కంపించింది. మహారాష్ట్రోలని సత్తారా జిల్లా పట్టణ సమీపంలో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో కూడిన ప్రకంపనలు నమోదైనట్టు భారత భూభౌతిక శాస్త్ర విభాగం వెల్లడించింది. కాగా, ఈ భూమి ప్రకంపనలతో కడపటి వార్తలు అందేసమయానికి ఎలాంటి అస్తినష్టం కానీ, ప్రాణనష్టం కానీ సంభవించినట్లు సమాచారం లేదని అధికారులు వెల్లడించారు.

భూమి ఉపరితలానికి సుమారు 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని అధికారులు గుర్తించినట్లు తెలిపారు. తొలి ప్రకంపన ఉదయం 7.11 గంటల సమయంలో నమోదైందని, ఆపై మరికొన్ని స్వల్ప ప్రకంపనలు వచ్చాయని అన్నారు. 3.4 తీవ్రతతో వచ్చే భూకంపాలు ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించదని అధికారులు చెబుతున్నారు. కాగా, భూకంపం వస్తోందని ప్రజలు ఇళ్లలోంచి వీధుల్లోకి పరుగులు పెట్టారు.

ఈ భూ ప్రకంపనలకు సంబంధించిన సంబంధించి మరిన్ని వివరాలు మాత్రం తెలియాల్సి వుంది. మహారాష్ట్రంలో పక్షం రోజుల వ్యవధిలో ఇది రెండో భూకంపం. గత నెల 21న ఇదే సత్తారా జిల్లా పరిధిలోని కొన్యా డ్యామ్ పరిధిలో 3.6 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ భూకంప నష్టంపై వివరాలు అందాల్సి వుంది. సరిగ్గా ఈశాన్య రాష్ట్రాలు హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, ఢిల్లీ ఎన్సీఆర్ లలో భూమి కంపించిన రెండు రోజుల తరువాత ఇక్కడ భూమి కంపించడంతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న భయాందోళన మాత్రం ప్రజల్లో నెలకొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : earth quake  Maharashtra  satara  lunar eclipse  astrology  science and technology  

Other Articles