Eclipse Not Effect on Medaram Jatara | మేడారం జాతర.. సంపూర్ణ చంద్ర గ్రహణం ప్రభావం.. ఉంటుందా? లేదా?

Medaram jatara 2018 begins

Medaram Jatara, Sammakka-Saralamma Jatara, Medaram Jatara 2018, Lunar Eclipse, Medaram Poojari

Historic Sammakka-Saralamma jatara at Medaram would begin on the full moon day of Magha Masam as per the Hindu lunar calendar. Lunar Eclipse Not Effect on Jatara Poojaris Confirmed.

మేడారం జాతర.. మరి గ్రహణం ప్రభావం?

Posted: 01/31/2018 11:09 AM IST
Medaram jatara 2018 begins

మేడారం నాలుగు రోజుల పాటు జరిగే సమక్క-సారలమ్మ మహా జాతరకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు(జనవరి 31, బుధవారం) నుంచి జాతర ప్రారంభంకానుంది. గద్దెల దిశగా పగిడిద్దరాజు, గోవిందరాజులు పయనం మొదలైంది. ఈ రోజు సంపూర్ణ చంద్రగ్రహణం ఉండటంతో భక్తుల్లో కొంత గందరగోళం నెలకొంది. దీనికి ప్రధాన పూజారి సిద్దబోయిన అరుణ్ వివరణ ఇచ్చారు.

వనదేవతల పూజలకు గ్రహణం వర్తించదని ఆయన తెలిపారు. ఈ సాయంత్ర యథావిధిగా సారలమ్మను తీసుకొస్తామని చెప్పారు. కావున భక్తులు పెద్ద ఎత్తున్న హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చాడు. ఇక కన్నెపల్లిలో పూజల అనంతరం సారలమ్మ గద్దెపైకి వస్తుందని, చేయాల్సిన క్రతువులను గ్రహణానికి ముందే పూర్తి చేస్తామని తెలిపారు.

కాగా, పెనక వంశీయులైన పూజారులు అరణ్యం గుండా 70 కిలోమీటర్లకు పైగా కాలినడకన గోవిందరావుపేట మండలం కర్లపెల్లి లక్ష్మీపురానికి చేరుకుని.. అక్కడి పెనక వంశీయుల కుటుంబీకులతో సేదతీరి... ఈ తెల్లవారు జామున 4 గంటలకు పగిడిద్దరాజుతో కలసి బయలు దేరారు. ఇప్పటికే పగిడిద్ద రాజు జంపన్న వాగు దగ్గరకు చేరుకున్నారు. వెనకాలే గోవింద రాజులు వస్తున్నారు.

సారలమ్మను కన్నెపల్లి నుంచి పూజారులు వెదురుబుట్టలో ముస్తాబు చేసి తీసుకొస్తున్నారు. అమ్మవారిని బయటకు తీసుకొచ్చే ముందు గుడి ముందు భక్తులు తడి వస్త్రాలతో వరం పడతారు. వారిపై నడుచుకుంటూనే సారలమ్మను తీసుకొస్తారు. సారలమ్మ రాక కోసం జంపన్నవాగు దగ్గర పగిడిద్ద రాజు, గోవింద రాజులు వేచి చూస్తుంటారు. సారలమ్మ అక్కడికి చేరుకోగానే ముగ్గుర్ని ఒకేసారి ఊరేగింపుగా గద్దెల మీదకు తీసుకొస్తారు. బుధవారం సాయంత్రం ఆరు గంటల సమయంలో సారలమ్మ గద్దె మీదకు రానుంది.

కన్నెపల్లి నుంచి జంపన్నను తీసుకొచ్చొ సంపెంగవాగు వద్ద ఉన్న రావిచెట్టు వద్ద ఇప్పటికే ప్రతిష్టించారు. సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవింద రాజులు గద్దెలకు చేరుకోవడంతో జాతర మొదలవుతుంది.

రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపములో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠిస్తారు. దేవతలు గద్దెలపై ప్రతిష్ఠించే సమయములో భక్తులు పూనకంతో ఊగి పోతారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యద్ద స్థానానికి తరలిస్తారు. వంశ పారంపర్యముగా వస్తున్న గిరిజనులే పూజార్లు కావడం ఈ జాతర ప్రత్యేకత. తమ కోర్కెలు తీర్చమని భక్తులు అమ్మవార్లకు బంగారము (బెల్లము) నైవేద్యముగా సమర్పించుకుంటారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles