15th-century manuscript decoded using AI 600 ఏళ్లనాటి లిపి గుట్టువిప్పిన గూగుల్

Ai researchers might have solved a bizarre 600 year old cryptic puzzle

voynich manuscript, google translate, uc alberta, University of Alberta, computer science professor Greg Kondrak, Bradley Hauer, artificial intelligence, hebrew, ai, technology, internet, computing, open source, linux, personal technology

A team of two researchers, including University of Alberta’s computer science professor Greg Kondrak and his graduate student Bradley Hauer, might have cracked one of most bizarre puzzles that exist on earth.

600 ఏళ్లనాటి లిపి గుట్టువిప్పిన గూగుల్

Posted: 01/31/2018 10:34 AM IST
Ai researchers might have solved a bizarre 600 year old cryptic puzzle

దాదాపుగా 600 ఏళ్లనాటి ఓ లిపి గురించి ఓ శతాబ్ధకాలంగా జరుపుతున్న శోధనలో కృతిమ మేధస్సు తన సత్తాను చాటి.. పరిశోధనను దాదాపుగా పూర్తి చేసింది. మానవుడు కల్పనల చేత రూపోందిన కృతిమ మేధస్సు.. ఎట్టకేలకు మనషి వల్ల సాధ్యం కాని పనిని సుపాధ్యం చేసింది. శతాబ్ధపు కాలంగా సాగుతున్న పరిశోధనలకు పుల్ స్టాప్ పెట్టేసింది. గజిబిజిగా, రకరకాల చిత్రపటాలతో ఉన్న రాతప్రతి మిస్టరీని కృత్రిమ మేధస్సు విప్పింది.

వివరాల్లోకి వెళ్తే.. 15వ శతాబ్దం అనగా సుమారు 1404 నుంచి 1438 మధ్యకాలానికి చెందిన ‘వోయెనిచ్‌ రాతప్రతి ఓ పాలిస్ బుక్ డీలర్ కు లభ్యం కాగా, ఆయన దానిని చరిత్రకారులకు అందజేశారు. సుమారు 240 పేజీల గల ఈ రాతప్రతి ఏ కాలం నాటిదో తెలుసుకునే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. అయితే దీనిని చదవడం, విశ్లేషించడం చరిత్రకారులకు, గూఢలిపిని తర్జుమా చేసేవారికి సాధ్యం కాలేదు. వీరితో పాటు రెండో ప్రపంచ యుద్దంలో కోడ్ ను డీకోడ్ చేసినవారు కూడా ఈ లిపి గుట్టును విప్పలేకపోయారు.

దీంతో ఈ ప్రతి పెద్ద పజిల్‌ గా మిగిలిపోయింది. దీంతో 2018వ సంవత్సరంలో మానవుడు తన మేదోసంపత్తితో కృతిమ మేదస్సును కూడా అందుబాటులోకి తీసుకువచ్చిన తరుణంలో.. అదే అల్టర్నేటివ్ ఇంటెలిజెన్స్ ఈ లిపిని గుర్తించడం ప్రారంభించింది. అప్పటి వరకు ఇది అరేబియన్ బాష అన్న వాదనలు వినిపించినా.. అది పూర్తిగా హెబ్రూ బాషగా పేర్కొనింది కృత్రిమ మేధస్సు. దీంతో గత శతాబ్దకాలంగా లిపి కోడ్ ను బ్రేక్ చేయడానికి మానవుడు సృష్టించిన అల్టర్నేట్ ఇంటెలిజెన్స్ దోహదం చేసింది.

కెనడాలోని అల్బెర్టా విశ్వవిద్యాలయానికి చెందిన కంప్యూటర్ సైన్స్ శాస్త్రవేత్త గ్రేగ్ కొన్డ్రాక్, అతని శిష్యుడు బ్రాడ్లీ హయుర్ లు ఈ లిపిని బ్రేక్ చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా 400 విభిన్న భాషలను ఉపయోగించుకున్నారు. అయినా వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఎట్టకేలకు కృతిమ మేదస్సు వినియోగించాలనుకుని గూగుల్ ట్రాన్స్ లేటర్ ను వినియోగించారు. దీని ద్వారా ఈ రాతప్రతి హిబ్రూ భాషలో ఉందని నిర్ధారించుకున్నారు. తొలుత ఇది అరబిక్‌ భాషలో ఉందని భావించినట్టు వారు తెలిపారు.

అయితే చివరకు హిబ్రూ భాషలో రాసినట్లు తేలిందని కొన్డ్రాక్ చెప్పారు. 80 శాతం పదాలు హిబ్రూ నిఘంటువులో ఉన్నట్లు తెలిసినప్పటికీ, రాతప్రతిలో ఏం రాశారో తర్జుమా చేయడం ఏ మేధావి వల్ల కాలేదని ఆయన చెప్పారు. ఎట్టకేలకు గూగుల్‌ ట్రాన్స్‌ లేటర్ రహస్యాన్ని విప్పిందని ఆయన చెప్పారు. అయితే ఆ రాతప్రతి ‘ప్రజలకు, నాకు, ఇంట్లో వ్యక్తికి, పూజారికి ఆమె సలహాలు ఇచ్చింది’ అనే వాక్యంతో మొదలుకావడం విచిత్రంగా ఉందని ఆయన తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles