Drunk cop crashes car మద్యం మత్తులో సిఐ రాంగ్ డ్రైవింగ్..

Drunk rams into vehicles in hyderabad 3 injured

cop drunk and drive, police officer wrong driving, amberpet training centre ci, ci girish rao, drunk and drive, car, victims, amberpet training centre, Yapral, medchal, rachakonda police, telangana

A police Inspector left two persons injured and three vehicles damaged when the four-wheeler he was driving in a drunken condition rammed them at Yapral in Jawaharnagar.

సిఐకి మత్తు వదిలించిన రాచకొండ పోలీసులు..

Posted: 01/30/2018 11:39 AM IST
Drunk rams into vehicles in hyderabad 3 injured

పోలీసులంటేనే రక్షకభటులని వారి వద్దకు దైర్యంగా వెళ్లి తమ సమస్యలను చెప్పుకోవచ్చనన్న అభిప్రాయం మొదట్లో ప్రజలకు ఉండేది. రానురాను కొందరు పోలీసు అధికారులు తామే చట్ట పరిరక్షకులమని భావించి.. తామేం చేసినా చెల్లుతుందన్న అభిప్రాయానికి వస్తున్నారు. ఇప్పటికే పలువురు పోలీసుల కీర్తిప్రతిష్టలకు పాతర వేసేవిధంగా పలు అనాగరిక చర్యలకు పాల్పడిన ఘటనలు ఇటీవలి కాలంలో వెలుగుచూశాయి.

కాగా, తాజాగా ఓ అధికారి అందులోనూ కొత్తగా పోలీసు శాఖలోకి అడుగుపెట్టే పోలీసులకు.. విధుల్లో ఏం చేయాలో, ఎం చేయకూడదన్న వాటిపై తగు శిక్షణ ఇచ్చే స్థాయిలో వుండే అధికారి తప్పతాగి వాహనాన్ని నడుపుతూ.. రాంగ్ రూట్లో వెళ్లడమే కాకుండా తనకు అడ్డం వచ్చిన వాహనదారులను ఢీకొనడంతో.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా యాప్రాల్ పరిధిలోని జవహార్ నగర్ పరిధిలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. అంబర్ పేట ట్రైనింగ్ సెంటర్ సీఐ జి.గిరీష్ రావ్ పీకల్దాక మద్యం సేవించి.. తానేం చేస్తున్నాడో తెలియని స్థితిలో నానా హంగామా చేశాడు. సీఐ వాహనం ఢీకొని గాయపడిన వారిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. యాక్టివాపై వెళ్తున్న దంపతుల కాళ్లు నుజ్జునుజ్జు అయ్యాయి. ఘటన అనంతరం సీఐ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఆరా తీశారు.

పరారీలో ఉన్న గిరీష్ రావును అదుపులోకి తీసుకుని బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించగా, 200 పాయింట్లగా నమోదైంది. కాగా సిఐ గిరీష్ రావుపై శాఖపరమైన చర్యలు కూడా వుంటాయని రాచకొండ పోలీస్ కమీషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. ఇక దీంతో పాటు ఇటు క్రిమినల్ కేసులు కూడా నమోదు చేశారు మేడ్చల్ పోలీసులు. సిఐ గిరీష్ రావుపై ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ 337, 338 ప్రకారం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : girish rao  drunk and drive  car  victims  amberpet training centre  Yapral  medchal  rachakonda police  telangana  

Other Articles