తమ కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు సంయమనం పాటించాలని సూచిస్తూ జనసేన పార్టీ ఈ రోజు ప్రెస్ నోట్ విడుదల చేసింది. 'జనసేన పార్టీది నాలుగేళ్లు కూడా నిండని పసి ప్రాయం. ఇటువంటి పసి బిడ్డను ఎదగనీయకుండా అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇదంతా రాజకీయంలో ఒక భాగం. అయినప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారంలో దృఢ చిత్తంతో, అఖండ తెలుగు జాతి అండతో జనసేన తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోన్న విషయం విజ్ఞులైన వారందరికీ విదితమే.ఈ మధ్యకాలంలో జనసేన పార్టీ శ్రేణుల్ని, అభిమానులను గందరగోళంలో పడేయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి, జరుగుతున్నాయి' అని జనసేన పేర్కొంది.
కాగా, కత్తి మహేష్ అంశంతో వ్యవహారం ముదురుతున్న వేళ.. కార్యకర్తలు గందరగోళానికి గురి కాకూడదన్న ఉద్దేశంతోనే జనసేన ఈ ప్రకటన విడుదల చేసింది. జనసేనను తెలుగు ప్రజలు కంటికి రెప్పలా కాపాడుకుంటారని పవన్ కల్యాణ్‌కి విశ్వాసం ఉంది. ఆయన మాటలను ఆచరిద్దాం.. ఆయన అడుగు జాడల్లో నడుద్దాం. జనసేన పార్టీ సిద్ధాంతాలయిన కులాలని కలిపే ఆలోచన విధానం.. మతాల ప్రస్తావన లేని రాజకీయం.. భాషల్ని గౌరవించే సంప్రదాయం.. సంస్కృతులని కాపాడే సమాజం.. ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం.. కోసం కృషి చేద్దాం' అంటూ పార్టీ ఉపాధ్యక్షుడు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
సంయమనం పాటించండి - Mahender Reddy @JanaSenaParty vice president. pic.twitter.com/qFLGs9ra0w
— JanaSena Party (@JanaSenaParty) January 19, 2018
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more