Chandrababu Approaching court on Own Govt Shameful | కోర్టుకు వెళ్తానన్న చంద్రబాబు.. అంటే ఏం చెయ్యట్లేదనేగా?

Chandrababu approaching court shameful

YSR Congress Party, Ambati Rambabu, Niti Aayog, VC Rajiv Kumar, Andhra Pradesh, Chief Minister, Chandrababu Naidu,

YSRCP Spokesperson Ambati Rambabu Responds On Niti Aayog VC Rajiv Kumar Comments. Chandrababu Approaching court on your Own Govt Comments Shameful Ambati Added.

ITEMVIDEOS: స్పెషల్ స్టేటస్.. బాబు అస్సలు ప్రయత్నించటం లేదా?

Posted: 01/19/2018 04:55 PM IST
Chandrababu approaching court shameful

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. విభజన చట్టంలోని హామీలను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చకుంటే కోర్టుకు వెళతామని చంద్రబాబు అంటున్నారని... ఇది నిజంగా సిగ్గు చేటు అని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ కూడా భాగస్వామి అని... వారి ప్రభుత్వంపై వారే కోర్టుకు వెళతారా? అని ప్రశ్నించారు. విభజన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని చెప్పారు. ప్రత్యేక హోదా ప్రదిపాదన వస్తే ఆలోచిస్తామని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ అన్నారని... ఆయన చెప్పిన మాటలు వింటుంటే ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ప్రయత్నం చేయలేదనే విషయం అర్థమవుతోందని అన్నారు.

ఏపీ నుంచి హైదరాబాద్ కు 40 శాతం ఆదాయం వస్తుందని నీతి ఆయోగ్ చెప్పిందని.. ఉమ్మడి రాష్ట్ర రాజధానిలోనే స్థిరపడిన వారు చెల్లిస్తున్న పన్ను ఇదంతా అని అంబటి చెప్పారు. పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో ఎంత దారుణంగా ఉందో చెబుతున్నాయని అంబటి పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles