Lalu's sister Gangotri dies from 'shock' లాలూ ఇంట విషాదం.. అందోళనతో సోదరి మృతి

Lalu s sister gangotri dies from shock

Lalu Prasad Yadav, Rabri Devi, GOPALGANJ, gangotri devi, CBI, Jagdhari Choudhary, Rudal Yadav, RJD, Rashtriya Janata Dal, Lalu Prasad fodder scam, fodder scam sentence, Fodder scam

A pall of gloom descended on RJD chief Lalu Prasad's family as his only sister Gangotri Devi (73) died of "shock", a day after her brother was sentenced to three-and-a-half years in jail in a fodder scam case.

లాలూ ఇంట విషాదం.. అందోళనతో సోదరి మృతి

Posted: 01/08/2018 09:16 AM IST
Lalu s sister gangotri dies from shock

పశుదాణా కుంభకోణంలో దోషిగా నిర్థారించబడి మూడున్నరేళ్ల జైలుశిక్షను అనుభవిస్తున్న బీహార్ మాజీ ముఖ్యమంత్రి, అర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్.. సోదరి గంగోత్రి కన్నుమూశారు. అమె అనారోగ్యంతో బాధపడుతూ.. అదివారం రోజున మృతిచెందారు. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్ అమె అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం వుంది. లాలూ తరపు న్యావాదులు అయన తరపున న్యాయస్థానంలో పేరోల్ కోసం అభ్యర్థించనున్నారు.

దీంతో లాలూ తన సోదరి గంగోత్రి అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశాలే ఎక్కువున్నాయి. లాలూ కన్నా నాలుగు సంవత్సరాలు పెద్దదైన గంగోత్రి తన సోదరుడంటే అమితమైన ప్రేమ. ఆమె లాలూను చిన్న వయసు నుంచే అభిమానించేదని, తన సోదరుడికి తిరిగి అధికారం దక్కాలని, మహాకూటమి అధికారంలోకి రావాలని మూడేళ్ల క్రితం ఆమె కఠోర ఉపవాస దీక్షలు చేసిందని తెలుస్తోంది.

తన సోదరుడిపై పశుదాణా కుంభకోణం కేసు అంతిమదశకు చేరుకున్నప్పటి నుంచి అమె అదే అందోళనలో వున్నట్లు సమాచారం. ఇక తీర్పు వచ్చిన తరువాత అమె ఆరోగ్యం క్షీణించిందని లాలూ కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఇక తన సోదరి మృతితో జైల్లో ఉన్న లాలూ ఆవేదనకు గురైనట్టు సమాచారం. ఆమె అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఆయన నేడు పెరోల్ పిటిషన్ వేయనుండగా, మానవతాదృక్పథంతో కోర్టు ఆయనకు పెరోల్ మంజూరు చేయవచ్చని సమాచారం. లాలూ పెరోల్ పిటిషన్ పై ఈ ఉదయం 10 గంటల తరువాత కోర్టు విచారణ జరపనుంది.

జైలులో లాలూ చేస్తున్న పనేంటి.? అర్జిస్తున్నదెంత.?

ఇక లాలూ ప్రసాద్ యాదవ్ కు జైలులో ఏం పని చేస్తున్నాడో తెలుసా.? అసలు ఆయన రోజువారి అదాయం ఎంతో తెలుసా.? దాణా కుంభకోణంలో దోషిగా తేలిన లాలూను పోలీసులు బిస్రా ముందా జైలుకు తరలించిన విషయం తెలిసిందే. అయితే జైలులో దోషులు కూడా ఏదో ఒక పనిచేయాల్సి వస్తుంది కాబట్టి.. లాలూకు కూడా ఇది తప్పలేదు. ఏం పని చేస్తారన్న విషయంలో మల్లగుల్లాలు పడుతున్న లాలూకు జైలు అధికారులు తోటమాలి (గార్డెనర్) పనిని అప్పగించారు.

అయితే గార్డనర్ గా పనిచేస్తున్న లాలూ రోజుకు రూ. 93 కూలీగా లభించనుందని తెలుస్తోంది. ఇదిలావుండగా, జైలుకు వెళ్లిన లాలూ పేరిట ఓ బహిరంగ లేఖ విడుదలైంది. దళితులు, వెనుకబడిన వర్గాల ప్రజల కోసం తాను పోరాడతానని, తనను దోషిగా తేల్చి, జైలుకు పరిమితం చేయాలని చూసినా తన పోరాటంలో వెనకడుగు వేయబోనని తెలిపారు. బీజేపీ తనకు వ్యతిరేకంగా క్షుద్ర పూజలు చేయిస్తోందని ఆరోపించారు. తమ మాట వినకుంటే ఎవరినైనా వేధించడం బీజేపీ నైజమని నిప్పులు చెరిగారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lalu Prasad Yadav  RJD  GOPALGANJ  gangotri devi  Rashtriya Janata Dal  fodder scam  

Other Articles