Privilege notice to Rahul Gandhi for 'Jaitlie' tweet ప్రధానిపై రాహుల్ మరో ట్విట్..

Rahul gandhi tweets new equation to explain slow economy

Rahul Gandhi, BJP, Congress president, Arun Jaitley, Rahul Gandhi privilege notice, Venkaiah Naidu, Rajya Sabha chairman, Lok Sabha, Lok Sabha speaker, Sumitra Mahajan

In a tweet, Congress president Rahul Gandhi had spelt finance minister Arun Jaitley’s surname differently while thanking him ‘for reminding India that our PM never means what he says or says what he means.

ప్రధానిపై రాహుల్ మరో ట్విట్.. ఇటు సభా హక్కులు నోటీసు

Posted: 01/06/2018 05:51 PM IST
Rahul gandhi tweets new equation to explain slow economy

కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై సభా హక్కుల నోటీసు జారీ అయ్యింది. ఈ మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలంటూ రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్ కు ఆ నోటీసును పంపారు. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పేరును వక్రీకరిస్తూ రాహుల్‌ ట్వీట్‌ చేయడంపై ఈ నోటీసు జారీ చేసినట్టు తెలుస్తోంది.

బీజేిపీ నేత, రాజ్యసభ ఎంపీ భూపిందర్‌ యాదవ్‌ రాహుల్‌ గాంధీపై ఈ నోటీసు ఇచ్చారు. ప్రధాని మోదీ, అరుణ్‌జైట్లీ వ్యాఖ్యలతో కూడిన ఓ వీడియోను ట్వీట్ చేస్తూ.. అందులో jaitleyకి బదులు jaitlieగా పేర్కొన్నారన్నారు. ఇలా చేయడం ఆయనను అవమాన పరచడమేనంటూ యాదవ్‌ ఈ నోటీసు ఇచ్చారు.

రాహుల్‌ గాంధీ లోక్‌సభ సభ్యుడైనందు వల్ల ఆయనపై తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ సదరు నోటీసును రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు లోక్‌సభ స్పీకర్‌కు పంపారు. కాగా బీజేపి సీనియర్‌ నేత ఎల్కే అడ్వాణీ నేతృత్వంలోని ఎథిక్స్‌ కమిటీ వద్ద ఇప్పటికే రాహుల్ కు సంబంధించిన ఒక ఫిర్యాదు పెండింగ్ లో ఉంది.

ఇదిలావుండగా, కేంద్ర ప్రభుత్వ విధానాల కారణంగా భారత ఆర్ధిక రంగం కుదేలైందని రాహుల్ దుయ్యబట్టారు. ఈ మేరకు ఆయన మరోమారు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మోడీ సర్కారును విమర్శించారు. మోదీ ప్రభుత్వం దృష్టిలో జీడీపీ అంటే స్థూల ఆర్ధిక వృద్ధి కాదనీ... ‘స్థూల విభజన రాజకీయాలు’ అని వ్యాఖ్యానించారు. ఇవాళ రాహుల్ ట్విటర్ వేదికగా స్పందిస్తూ...

‘‘ప్రధాని మోదీతో కలిసి ఆర్ధికమంత్రి జైట్లీ మేథస్సు రంగరించి సాధించిన స్థూల విభజన రాజకీయాల (జీడీపి)తో భారత్‌కు వచ్చింది ఇదీ...
నూతన పెట్టుబడులు : 13 ఏళ్ల కనిష్టానికి పడిపోయాయి.
బ్యాంకు పరపతి పెరుగుదల : 63 ఏళ్ల కనిష్టానికి దిగజారింది.
ఉద్యోగ కల్పన : 8 ఏళ్ల దిగువకు పడిపోయింది..
వ్యవసాయ జీవీఏ (స్థూల విలువ) వృద్ధి : 1.7 శాతం క్షీణించింది..
ద్రవ్యలోటు : 8 ఏళ్ల గరిష్టానికి పెరిగింది...
నిలిచిపోయిన ప్రాజెక్టులు : పైపైకి...’’ అంటూ కేంద్రాన్ని నిలదీశారు. ఇంతకు ముందు పోస్టులో ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నీ అబద్ధాలే చెబుతున్నారని ఆరోపించిన ఆయన... జైట్లీని ‘‘జైట్‌లై’’ అని సంబోధించిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  BJP  Congress  Arun Jaitley  privilege notice  Venkaiah Naidu  Sumitra Mahajan  

Other Articles