CM warns pakistan says it will be repeated మళ్లీ అదే రిపీట్ అవుద్దీ: హెచ్చరికలు చేసిన సీఎం

Up cm yogi says surgical strikes against pakistan to continue

yogi adityanath, pakistan, surgical strikes, india, pakistan, Line of Control, jammu and kashmir, SURGICAL STRIKE DATE, SURGICAL STRIKE 2017

Uttar Pradesh CM Yogi Adityanath warned Pakistan that surgical strikes will continue. His comments came in the wake of reports saying that Indian Army soldiers crossed over the Line of Control and killed three Pakistani army soldiers.

మళ్లీ అదే రిపీట్ అవుద్దీ: హెచ్చరికలు చేసిన సీఎం

Posted: 12/26/2017 08:46 PM IST
Up cm yogi says surgical strikes against pakistan to continue

భారత సరిహద్దు వెంబడి నిత్యం పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు అనిశ్చితి వాతావరణాన్ని సృష్టించి.. శాంతిభద్రతలకు విఘాతం కల్పించడంతో పాటు పాకిస్తాన్ అర్మీ కూడా నియంత్రణ రేఖలోనికి చోచ్చుకోచ్చి మరీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న క్రమంలో దాయాధి దేశానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ తీవ్ర స్థాయి హెచ్చరికలు జారీ చేశారు. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో భారత అర్మీ జరిపిన సర్జికల్ స్ట్రైక్ దాడులను గుర్తుపెట్టుకోవాలని అన్నారు.

పాకిస్తాన్ నియంత్రణ రేఖ వెంబడి కాల్పలు విరమణను ఉల్లంఘిస్తుండటం.. తీవ్రవాదులకు వెన్నుదన్నుగా వుంటూ భారత్ లోకి చొచ్చుకు వచ్చేందుకు సహకరిస్తున్న క్రమంలో ‘సర్జికల్ దాడులు మళ్లీ మళ్లీ జరుగుతాయి’ అంటూ పాకిస్థాన్ ని హెచ్చరించారు. పాక్ చర్యలకు ప్రతీకారంగా ఎల్ ఓసీ దాటి ఆ దేశ సైన్యంపై భారత బలగాలు కాల్పులు జరిపిన విషయాన్ని విలేకరులు ప్రశ్నించగా ఆయన పైవిధంగా స్పందించాల్సి వచ్చింది.

కాగా, గత శనివారం పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత జవాన్లపై కాల్పులు జరిపిన ఘటనలో నలుగురు మృతి చెందారు. ప్రతీకార చర్యల్లో భాగంగా భారత సైన్యం ఎల్ ఓసీ దాటి పాక్ సైన్యంపై నిన్న కాల్పులకు పాల్పడి ముగ్గురు పాకిస్తాన్ ప్రేరేపిత జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాదులను మట్టుబెట్టాయి. అంతకుముందు 2016 సెప్టెంబర్‌ 28 అర్ధరాత్రి సమయంలో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు మెరుపు దాడి చేసిన ఘటనను ఊటంకిస్తూ మళ్లీ మళ్లీ ఇదే రిపీట్ అవుద్దీ అని యోగి హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yogi adityanath  pakistan  surgical strikes  india  pakistan  Line of Control  jammu and kashmir  

Other Articles