JanaSena demands justice for medical students చంద్రబాబు ఎదుట జనసేనాని పవన్ కల్యాన్ డిమాండ్..

Pawan kalyan demands for justice in medical students row

Jana Sena, pawan kalyan, fatima medical college, medical students, fatima college row, pawan kalyan fatima collage row, pawan kalyan tweets, janasena fatima college row, chandrababu pawan kalyan row, pawan kalyan twitter, ap politics

actor turned politician Jana Sena president pawan kalyan tweets in favour of fatima medical students, demanding speedy justice.

చంద్రబాబు ఎదుట జనసేనాని పవన్ కల్యాన్ డిమాండ్..

Posted: 12/26/2017 08:21 PM IST
Pawan kalyan demands for justice in medical students row

సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యన్ మరోమారు అంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఓ సమస్య విషయమై వేగంగా స్పందించాలని డిమాండ్ చేశారు. ఇవాళ ట్విట్టర్ ద్వారా అయన మరోమారు చంద్రబాబు ప్రభుత్వాన్ని సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలని కోరారు. ఫాతిమా క‌ళాశాల విద్యార్థుల సమస్యపై మరోమారు గళమెత్తిన ఆయన ఇప్పటికే విలువైన విద్యా సంవ‌త్స‌రాన్ని కోల్పోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. యాజ‌మాన్యం త‌ప్పిదం వ‌ల్ల అమాయ‌క విద్యార్థులు మానసిక అందోళనకు గురవుతున్నారని అవేదన వ్యక్తం చేశారు.

ట్విట్ట‌ర్ ద్వారా ఫాతిమా క‌ళాశాల విద్యార్థుల సమస్యను ప్రభుత్వం త్వరగా స్పందించి న్యాయం చేయాలని కోరారు. మనం కోల్పోయే ప్రతీ గంట స‌మ‌యం మ‌న‌ భవిష్యత్ ను దురదృష్టకరం చేసుకోవ‌డ‌మే అవుతుంద‌న్న నెపోలియన్ వ్యాఖ్యలను ఊటంకిస్తూ విద్యార్థులకు త్వరితగతిన న్యాయం చేయాలని పేర్కొన్నారు. బాధ్యతరాహిత్యం, అత్యాశతో ఫాతిమా కాలేజీ యాజ‌మాన్యం తప్పిందం చేస్తే.. దానికి విద్యార్థులు ఎందుకు బలిపశువులు కావాలని ఆయన ప్రశ్నించారు.

ఎంతో తెలివిగ‌ల ఫాతిమా విద్యార్థులు చాలా బాధ ప‌డుతూ కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు విన్న‌పాలు చేశార‌ని, కానీ వారి బాధ‌ను గుర్తించకుండా ప్రభుత్వాలు కాలయాపన చేశాయని పవన్ మండిప‌డ్డారు. ఫాతిమా మెడికల్‌ కళాశాల చేసినట్లు విదేశాల్లో జరిగితే జరిమానా విధించి, అనుమతులను రద్దు చేసి, మేనేజ్‌మెంట్‌ను జైలుకు పంపేవార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. స‌ద‌రు విద్యార్థుల త‌ల్లిదండ్రులు అధిక మొత్తంలో ఫీజులు చెల్లించి త‌మ పిల్ల‌లను ఆ కాలేజీలో చేర్పించార‌ని అన్నారు.

విద్యార్థులు ఎంతో శ్ర‌మ ప‌డి ఫాతిమా క‌ళాశాలో విద్యను పూర్తి చేశార‌ని, క‌ళాశాల యాజ‌మాన్యం చేసిన త‌ప్పిదంతో వారి భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేయబడిందని, దీంతో వారు అందోళన చెందుతున్నారని జనసేనాని అన్నారు. వచ్చే ఎన్నికల సన్నాహాల్లో పడి ప్రభుత్వాలు ప్రస్తుత విద్యావ్యవస్థ ప్రక్రియను, విద్యార్థుల భవిష్యత్ ను పట్టించుకోవడం లేదని విమర్శించారు. విద్యార్థులకు వెంట‌నే న్యాయం చేయాలని, వారికి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అండ‌గా నిల‌వాలని పవన్ కల్యాన్ కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jana Sena  pawan kalyan  fatima medical college  chandrababu  pawan kalyan twitter  ap politics  

Other Articles