Centenarian grandma finds Rahul Gandhi 'handsome' శతాధిక వృద్దురాలు.. ఈ నేత అందగాడంటూ సిగ్గుపడింది..

Rahul gandhi finds 107 year old admirer sends her big hug

rahul gandhi, christmas, rahul gandhi fans, rahul gandhi admirer, 107-year-old admirer of rahul gandhi, handsome rahul gandhi,

In a tweet, Bangalore-based woman Dipali Sikand wrote that her grandmother, who turned 107, had a wish to meet Rahul Gandhi, whom she found as "handsome".

శతాధిక వృద్దురాలు.. ఈ నేత అందగాడంటూ సిగ్గుపడింది..

Posted: 12/26/2017 11:39 AM IST
Rahul gandhi finds 107 year old admirer sends her big hug

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం. అక్కడ కాషాయ పార్టీకి షాకిస్తూ.. ఆరు పర్యాయాలలో తొలిసారి అత్యంత కనిష్టస్థాయిలో సీట్లు సాధించేలా చేపట్టిన ప్రచారంతో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై యూపీఏ పక్షానికి చెందిన రాజకీయ పార్టీలతో పాటు ఎన్టీయే పక్షానికి చెందిన రాజకీయ నేతలు కూడా అదేస్థాయిలో అయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదే క్రమంలో అయన పెళ్లికి సంబంధించిన వార్తలు కూడా అనేకం వచ్చాయి. అయితే వాటిపై రాహుల్ కూడా తనదైన ధోరణిలో స్పందించాడు.

ఇక తాజాగా రాహుల్ గాంధీపై ఓ శతాధిక వృద్ధురాలు కూడా మనసు పారేసుకుంది. నాయినమ్మ వయస్సున్న అమె రాహుల్ అందగాడంటూ సిగ్గుపడిందట. ఈ విషయాన్ని అమె మనవరాలు ట్విట్టర్ లో పెట్టిడంతో వైరల్ గా మారింది. ఇక దానికి రాహుల్ గాంధీ కూడా స్పందించి ప్రతిస్పందించడంతో నెట్టింట బామ్మ సంచలనంగా మారింది. తన 107 బర్త్ డే సందర్భంగా కేక్ కట్ చేసిన అనంతరం ఈ బామ్మ ఈ వ్యాక్యలు చేసింది. అంతేకాదండోయ్ రాహుల్ గాంధీని కలుస్తానని సిగ్గు మొగ్గలైంది.

ఈ విషయాన్ని అమె మనవరాలు దీపాలి సికంద్ తన ట్విట్టర్ లో పోస్టు చేసింది. బామ్మకు బర్త్ డే గిఫ్ట్‌గా ఏం కావాలని అడిగితే.. 'రాహుల్ అందగాడు.. అతడిని కలవాలని ఉంది' అని చెప్పి సిగ్గుపడిందని దీపాలి ట్విట్టర్ ద్వారా రాహుల్ గాందీకి విషయాన్ని తెలిపింది. దీనికి స్పందించిన రాహుల్.. బామ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ, అంతే చిలిపిగా స్పందించారు. 'నా తరపున మీరే ఒకసారి మీ బామ్మగారిని గట్టిగా కౌగిలించుకోండి..' అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, ఫోన్ చేసి బామ్మకు శుభాకాంక్షలు కూడా చెప్పడంతో ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఇక ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయింది. సోషల్ మీడియాలో నెటిజన్లు వివిధ కామెంట్లతో రక్తికట్టిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress  Rahul Gandhi  admirer  107 year old  handsome  India  current affairs  

Other Articles