No one will marry girls who wear jeans, says Satyapal Singh మరో వివాదంలో కేంద్రమంత్రి.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు

No boy will marry girl who wears jeans union minister satyapal singh

Union Minister fresh controversy, Satyapal Singh, Satyapal Singh jeans remark, Satyapal Singh jeans to mandap remark, Uttar Pradesh Chief Minister, Yogi Adityanth, Gorakhpur, controversial remark by BJP MP, Baghpat MP, Satyapal Singh​, fresh controversy, maharana pratap siksha parishad, Gorakhnath, girls dressing, jeans remark, gorakhpur, baghpat mp, uttar pradesh, latest news

Union Minister Satyapal Singh said that "men will not want to marry women who wear jeans". The statement from the Minister of State for Human Resource Development came during a meeting that was held on Sunday at Gorakhpur

మరో వివాదంలో కేంద్రమంత్రి.. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు

Posted: 12/12/2017 06:48 PM IST
No boy will marry girl who wears jeans union minister satyapal singh

అధికార పార్టీలో వున్నమన్న ధీమా.. అందులోనూ కేంద్రమంత్రులుగా బాద్యతలు వుండటం అంటే అది తక్కువేం కాదు. అయితే వాటిని ప్రజల సమస్యల పరిష్కారంలో శాఖపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో వినియోగించాల్సిందిపోయి.. అనవసర వివాదాలకు దారితీసేలా కొందరు కేంద్రమంత్రులు వ్యహరిస్తున్న తీరు అధికార పార్టీకి, ప్రధానికి తలనొప్పులు తెచ్చిపెడుతుంది. తాజాగా మహారాష్ట్ర ముంబై పోలీసు కమీషనర్ గా సేవలందించి.. రాజకీయ అరంగ్రేటం చేసిన ఓ కేంద్రమంత్రి కూడా తాజాగా మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.

ఇప్పటికే బీజేపి నేతలు.. మహిళలకు సంబంధించిన అంశాల్లో అధికంగా జోక్యం చేసుకుంటున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న క్రమంలో.. ఆ మధ్య రాజస్థాన్ కు చెందని బీజేపి నేత అర్థరాత్రిళ్లు మహిళలకు రోడ్లపై ఎం పని అంటూ ప్రశ్నించి విమర్శలను ఎదుర్కోగా, మరోకరు అమ్మాయిలు రాత్రిళ్లు బయటకు రావాలంటే మగతోడు లేకుండా రాకూడదని కూడా వ్యాఖ్యనించారు. ఇలా ఇప్పటికే మహిళల విషయంలో విమర్శలు ఎదుర్కొంటున్న నేతల జాబితాలో తాజాగా మరో కేంద్రమంత్రి కూడా చేరిపోయి విమర్శలను ఎదుర్కొంటున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ బాగ్ పాట్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి సత్యపాల్‌ సింగ్‌ మహిళల వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు  చేశారు. జీన్స్ వేసుకుని పెళ్లి మండపంలోకి వచ్చే ఏ అమ్మాయినైనా అబ్బాయిలు పెళ్లాడతారా? అని విద్యార్థులను ప్రశ్నించారు. గోరఖ్ పూర్ మఠానికి అనుబంధంగా కొత్తగా ఏర్పాటు చేయనున్న విద్యా సంస్థ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి సత్యపాల్ సింగ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

జీన్స్ ప్యాంట వేసుకుని వచ్చి.. ‘నేను మత గురువుగా ఉంటాను’ అంటే మనం అంగీకరిస్తామా? ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. అలాగే  అమ్మాయిలు జీన్స్ ధరించి పెళ్లి మండపంలోకి వస్తే ఏ అబ్బాయైనా చచ్చినా ఆమెను పెళ్లి చేసుకోడు’ అని సత్యాపాల్ సింగ్ వ్యాఖ్యానించారు. అయితే అదే వేదికపై ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ కూడా ఉన్నారు. యోగి ప్రధాన అర్చకుడిగా ఉన్న గోరఖ్ పూర్‌ మఠానికి అనుబంధంగా నడిచే మహారాణా ప్రతాప్ శిక్షా పరిషత్ ‌(ఎంపీఎస్పీ) విద్యాలయం శంకుస్థాపన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా మహిళలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కూడా ఎలాంటి స్పందన తెలియజేకపోవడంతో మహిళా సంఘాలు అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles