TN court hands death sentence to six పరువు హత్య కేసులో.. న్యాయస్థానం సంచలన తీర్పు

Tn court hands death sentence to six in honour killing case

Judge Alamelu Nataraj, Dalit youth, Kausalya, shankar, Annalakshmi, Udumalaipet, Tirupur, sankar murder case, dalit man murder case, tamil nadu honour killing, honour killing tamil nadu, honour killing india, Udumalaipet, Tirupur, tamil nadu

A local court in Tamil Nadu sentenced six persons to death in connection with the suspected honour killing case.

పరువు హత్య కేసులో.. న్యాయస్థానం సంచలన తీర్పు

Posted: 12/12/2017 06:07 PM IST
Tn court hands death sentence to six in honour killing case

తమిళనాడులోని ఉడుమల్ పేటలో జరిగిన పరువు హత్యలో న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. గత ఏడాది మార్చి 13న వధువు తండ్రి కొత్త జంటపై కత్తులతో దాడి చేయగా, వరుడు అక్కడికక్కడే ప్రాణాలను కొల్పయాడు. అతని భార్య మాత్రం తీవ్ర గాయాలపాలైంది. ఈ పరువు హత్య కేసును విచారించిన న్యాయస్థానం ఈ కేసులో వధువు తండ్రితో పాటుగా మరో ఐదుగురికి మరణశిక్షను విధించింది. మరో అయిదుగురికి జీవిత ఖైదు శిక్షను విధించింది. కాగా మరోకరికి మాత్రం మూడేళ్ల శిక్షను విధిస్తూ తీర్పునిచ్చింది.

వివరాల్లోకి వెళ్తే, శంకర్ అనే దళిత యువకుడు కౌశల్య అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ వివాహాన్ని అంగీకరించలేకపోయిన కౌశల్య తండ్రి ఉడుమల్ పేట బస్టాండ్ వద్ద పబ్లిక్ గా శంకర్ దంపతులపై దాడి చేశాడు. ఈ దాడిలో శంకర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... కౌశల్య తీవ్ర గాయాలపాలైంది. ఆ ఘటనకు సంబంధించిన ఓ వీడియో ఫుటేజ్ వైరల్ గా మారింది. తమిళనాట ఆ హత్య సంచలనంగా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడ్డ 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 1500 పేజీల రిపోర్ట్ ను తయారు చేశారు.

ఈ హత్య ఉదంతాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం కేసు విచారణ కోసం స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను కూడా నియమించింది. తిరుపూర్ సెషన్స్ కోర్టులో నవంబర్ లో కేసు విచారణ పూర్తయింది. తుది తీర్పును ఈరోజు కోర్టు వెలువరించింది. మొత్తం ఆరుగురికి మరణశిక్షను విధించింది. ఇందులో శంకర్ మామ కూడా ఉన్నారు. మిగిలిన ఐదుగురిలో ఒకరికి జీవితఖైదును, మరొకరికి మూడేళ్ల శిక్షను విధించింది. మిగిలిన ముగ్గురుని నిర్దోషులుగా విడుదల చేసింది. నిర్దోషిగా విడుదలైన వారిలో కౌశల్య తల్లి కూడా ఉంది. న్యాయమూర్తి నటరాజన్ ఈ తీర్పును వెలువరించారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles