army man shot pet dog, video viral on social media వీడు మాజీ సిపాయి కానేకాదు.. కసాయే..!

Army man shoots chained pet dog video goes viral on social media

army man, pet dog, shoot, cruelity, riffle, satbir singh, punjab police, crime, viral video, video viral, man kills dog, cruelty to animals, Punjab, Barnala, Barnala video, man shoots dog video

Punjab Police have arrested a man after a video showed him shooting his pet dog with a rifle, after the video went viral. The police booked Satbir Singh, and his friend, but both of them were later released on bail.

ITEMVIDEOS: వీడు మాజీ సిపాయి కానేకాదు.. కనికరం లేని కసాయే..!

Posted: 12/09/2017 04:05 PM IST
Army man shoots chained pet dog video goes viral on social media

ఓ మాజీ సైనికుడు చేతిలో తుపాకి వుందికదా అని రెచ్చిపోతే ప్రజలకు ఎంతో నష్టం. అలాంటి ఘటనకే పాల్పడిన ఓ మాజీ సైనికుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చేతిలో అయుధం వుంది కదా అని తన పెంపుడు కుక్కను గొలుసుతో కట్టేసి కాల్చి చంపాడు మీ కసాయి. చేసింది సరిహద్దులో సిపాయి ఉద్యోగం అయినా.. ఈయన చేసిన ఈ దారుణ ఘటనతో నెట్ జనులు కసాయి అని.. కనికరమే లేదా..? అసలు మనిషివేనా అంటూ ఈడడించుకుంటున్నారు.

ఈ ఘటన పంజాబ్‌లోని బర్నాలా జిల్లా బాద్బార్‌ గ్రామంలో చోటుచేసుకుంది. ఇండియన్ అర్మీలో సేవలందించిన అజిత్‌ సింగ్‌ పంజాబ్ లోని బర్నాలా జిల్లా బాద్బార్‌ గ్రామానికి చెందినవాడు. తన మిత్రుడైన సత్వీర్‌ సింగ్ తో కలిసి అజిత్ సింగ్ తన ఇంట్లో ముద్దుగా పెంచుకుంటున్న శునకాన్ని అత్యంత దారుణంగా హత్యమార్చాడు. రోడ్డుపైన అందరూ చూస్తుండగానే కుక్క మెడకు గొలుసును కట్టి అది పారిపోకుండా చేసి దానిని కాల్చి దారుణంగా హతమార్చాడు.

ఈ ఘటనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మాజీ సైనికుడి కుమారుడు.. తన తండ్రి చేస్తున్న అమానవీయ చర్యను అడ్డుకునేందుకు, ఈ సన్నివేశాలను వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఇది కాస్తా నెట్టింట్లో సంచలనంగా మారింది. మాజీ సైనికుడి దారుణంపై నెట్ జనులు తీవ్రంగా స్పందించారు. జంతు ప్రేమికులు తీవ్ర మనస్థాపానికి గురిచేసిన ఈ వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి. జంతు హక్కుల సంస్థ.. వారిపై చర్యలను తీసుకోవాలని కేంద్రమంత్రి మనేకా గాంధీ, పంజాబ్‌ డీజీపీలకు లేఖ రాశారు.

రంగంలోకి దిగిన పోలీసులు వారిపై జంతు హింస కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. బెయిల్‌పై బయటకు వచ్చిన మాజీ సైనికుడు అజిత్‌ సింగ్‌ మాట్లాడుతూ.. నా పెంపుడు కుక్కకు ర్యాబీస్‌ వ్యాధి సోకింది.. ఈ కుక్క తన రెండు గేదెలను, చాలా మంది ప్రజలను కరిచింది అందుకే చంపానని ఆయన పోలీసులకు తెలిపారు. చాలా ప్రేమతో ఆ కుక్కను నేను పెంచుకున్నాను. అలాంటిది నేనే ఎందుకు చంపుకుంటానని మాజీ సైనికుడు చెప్పారు. కుక్క అవయావాలను టెస్టు నిమిత్తం డాక్టర్‌ ల్యాబ్ కు పంపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : army man  pet dog  shoot  cruelity  riffle  satbir singh  barnala  punjab police  crime  viral video  

Other Articles