Woman beaten up and striped naked by locals in Narela అన్యాయంపై పోరాడితే.. నగ్నంగా ఊరేగిస్తారా..?

Woman brutally beaten stripped paraded naked in narela delhi

Delhi Commission for Women (DCW), illegal sale of liquor, Praveen, physical assault on woman, Sansi community, delhi police, voilence on woman, asha, crime

Even as the DCW said a woman was beaten up and paraded naked after she helped in a raid in north Delhi against illegal sale of liquor, police denied it and said two women have been arrested for physical assault.

ITEMVIDEOS: ఇదేమీ రాజ్యమరన్నా.. అన్యాయంపై పోరాడితే.. నగ్నంగా ఊరేగిస్తారా..?

Posted: 12/08/2017 01:02 PM IST
Woman brutally beaten stripped paraded naked in narela delhi

ప్రజలు నీతి, న్యాయం, ధర్మాన్ని అనుసరించాలని, అన్యాయాలు, అక్రమాలు, హింసా మార్గాలను వీడాలని మన నేతలు దేశ స్వాతంత్ర సమరయోధుల జన్మదినాల రోజునో లేక వర్థంతి రోజనో నివాళులు అర్పించి.. వారి అడుగుజాడల్లో నడవాలని పిలుపునీయడం సాధారణమే. అయితే వీటిని అచరించే వాళ్లు ఎంతమంది వుంటారు..? ఇది ప్రశ్నార్థకమే. ఎవడెలా పోతే నాకేంటి.. నేను నా కుటుంబం బాగుంటే చాలు అనుకునే వారి సంఖ్య రానురాను మరీ ఎక్కువైపోతుంది. ఈ క్రమంలో తమ బస్తీలో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు యత్నించిన ఓ మహిళకు ఘోరపరాభవం ఎదురైంది.

సభ్య సమాజంతో పాటు ఢిల్లీ పోలీసులు కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది. పోలీసులుగా వారు చేయలేని పని ఓ మహిళమణి ధైర్యంగా చేస్తే.. కనీసం అమెకు రక్షణ కల్పంచలేని పోలీసులు అసలు రక్షక భటులేనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మహిళను ధైర్యాన్ని అభినందించి అమెకు అండగా నిలబడాల్సిందిపోయి.. లిక్కర్ మాఫియా నుంచి వచ్చే మామూళ్ల మత్తులో జోగుతున్న అధికారులు.. అమెకు జరిగిన అన్యాయం గురించి చెప్పినా పట్టించుకున్న పాపన పోలేదంటూ.. ఎంతటి దారుణంగా పరిస్థితి మారిందో అర్థం చేసుకోవచ్చు.

ఎక్కడో దేశ మూల నుంచి ఎవరో రాసిన ఉత్తరంపై స్పందించి వెంటనే చర్యలు తీసుకున్నే ప్రధాని.  బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి సోదరుడు వేసే వేషాన్ని చూసే ప్రధాని.. దేశరాజధానిలో.. అందునా మహిళలు అధికంగా అత్యాచారాలకు గురవుతున్న సందర్భంలో.. కనీసం ఇలాంటి ఘటనలపైనైనా మాత్రం స్పందించరా..? అన్న ప్రశ్నలు కూడా తెరపైకి వస్తున్నాయి. దేశ రాజధాని కేంద్రంగా ఎన్నో విదేశీ దౌత్యకార్యాలయాలు వున్న ప్రాంతంలో ఇలాంటి ఘటనలు జరిగితే.. ఇప్పటికే భారత పర్యటనపై తమ దేశస్థులకు పలు అంక్షలు విధించిన విదేశాలు.. ఇలాంటి ఘటనలే పునరావృతమైతే భవిష్యత్తులో ఎలాంటి అంక్షలు విధిస్తారో కూడా అలోచించాల్సిన అసవరం ఏర్పడుతుంది.

ఢిల్లీలోని పోలీస్‌ చౌకీ సమీపంలో నివసించే ప్రవీణ్ అనే మహిళ‌.. తమ బస్తీ నారెళ్లలో అక్రమంగా మద్యం అమ్ముతున్న విక్రేతలపై ఢిల్లీ మహిళా కమీషన్ కు పిర్యాదు అందించింది. ఈ అక్రమార్కుల వల్ల ప్రతినిత్యం తాము ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని కూడా సమాచారం అందించింది. దీంతో డిసిడబ్యూ పోలీసులు, ఎక్సైజ్ సిబ్బందితో కలసి సంయుక్తంగా దాడులు నిర్వహించి విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో అక్రమార్కులను అదుపులోకి తీసుకన్న పోలీసులు వారి నుంచి పెద్ద స్థాయిలో అక్రమ మధ్యాన్ని కూడా స్వాథీనం చేసుకున్నారు.

అయితే జైలుకు వెళ్లి బెయిలుపై వచ్చిన లిక్కర్ మాఫియాకు చెందిన అశా అనే మహిళ తన అనుచరులతో కలిసి సమాచారం అందించిన ప్రవీణ్ ఇంటికి వచ్చి అమెపై దాడికి తెగబడింది. రాడ్లతో ఆమెను కొడుతూ బట్టలను చించి పారేసి నగ్నంగా రోడ్డుపై ఊరేగించారు. ఆ దాష్టీకం మొత్తాన్ని వీడియో రికార్డింగ్‌ చేశారు. ఇంత జరుగుతున్నా స్థానిక పోలీసులు మాత్రం నిద్రావస్థలోకి జారుకున్నారు. కనీసం బాధిత మహిళ పిర్యాదు చేసిన తరువాతైనా స్పందించాల్సిన పోలీసులు కేవలం ఆమెపై దాడి మాత్రమే జరిగిందని నిర్లక్ష్యంగా సమాధానమివ్వడం కొసమెరుపు.

పోలీసుల వివరణపై ఆగ్రహం వ్యక్తం చేసిన డీసీడబ్ల్యూ పోలీస్‌ శాఖకు నోటీసులు జారీ చేసింది. ప్రవీణ డీసీడబ్ల్యూ వాలంటరీగా పని చేస్తోందని.. ఆమెకు అవమానం జరిగిన మాట వాస్తవమని డీసీడబ్ల్యూ చీఫ్‌ స్వాతి మలివాల్‌ అంటున్నారు. ఈ మేరకు రోహిణి డిప్యూటీ కమిషనర్‌ రాజ్ నీశ్ గుప్తాను తమ ఎదుట హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. కాగా, ఈ ఘటనపై ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవీల​ స్పందించారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవటం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లి.. స్పందించని పోలీస్‌ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరతానని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్లు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles