pawan kalyan fires on parakala for decieving chiranjeevi పరకాల ప్రభాకర్ పై నిప్పులు చెరిగిన పవన్.

Pawan kalyan slams parakala prabhakar on special status stand

Jana Sena, Pawan Kalyan, chalore chalore chal, polavaram project, east godavari, west godavari, rajamundry, party activists, telugu states tour, political tour,condolence, krishna ferry turndown, victim families, telangana, msc physics student, murali, Andhra Pradesh

JanaSena chief, power star Pawan Kalyan slams parakala prabhakar says he is also one of the person who decieved his brother and prajarajyam founder chiranjeevi.

ITEMVIDEOS: పరకాల ప్రభాకర్ పై నిప్పులు చెరిగిన పవన్ కల్యాన్

Posted: 12/07/2017 02:41 PM IST
Pawan kalyan slams parakala prabhakar on special status stand

ప్రజారాజ్యం పార్టీలో కీలక నేతగా వ్యవహరించిన పరకాల ప్రభాకర్ ఆ పార్టీ అధినేత చిరంజీవిపై అప్పట్లో చేసిన అరోపణలపై ఇవాళ జనసేన అధినేత పవన్ కల్యాన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజారాజ్యం పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తులలో పరకాల ప్రభాకర్ ఒకరని అన్నారు. తన సోదరుడు చిరంజీవి నోరులేని వ్యక్తి కాబట్టే ఆయనను తిట్టేసి వెళ్లిపోయారని, అదే సమయంలో తాను వుండివుంటే అప్పడు జరిగే పరిణామాలే వేరుగా వుండేవని పవన్ అన్నారు. పరకాల ప్రభాకర్ లాంటి కమిట్ మెంట్ లేని వ్యక్తులు జనసేనలో ఉండకూడదని అన్నారు.

ప్రజారాజ్యం పార్టీలో నేతగా వున్న పరకాల ప్రభాకర్.. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తుంటే.. ఆ నిర్ణయాన్ని ఎందుకు అడ్డుకోలేదని పవన్  ప్రశ్నించారు. ఒక అంశంపై ఊగిపోయిన పరకాలు మరుసటి రోజున అదే అంశమై ముందుకు సాగుదామంటే.. సినిమా షో అయిపోయినట్లుగా ఇక వేరే సినిమాకు వెళ్దాం అన్నట్లుగా వ్యవహరించారని.. ఇలాంటి బావజాలం వున్న నేతలకు తన పార్టీలో అసలు స్థానం వుండదని అన్నారు. నిస్వార్థ‌మైన వారు ప్ర‌జారాజ్యం పార్టీలో ఉండుంటే ప్ర‌జారాజ్యం ఇప్పుడు అధికారంలో ఉండేదని చెప్పారు. ప్ర‌జ‌ల‌కు మంచి చేయాల‌నే ఆలోచ‌న చిరంజీవికి ఉండేదని చెప్పుకొచ్చారు.

తన సోదరుడిపై కస్సుమని పడగ విప్పిన పరకాల ప్రభాకర్.. అదే రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని నరేంద్రమోడీని ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. ప్రశ్నించే తత్వం వున్న వ్యక్తి తన సోదరిడితో ఒకలా, మోడీతో మరోలా వ్యవహరించడం ఎలా సముచితం అన్నారు. పరకాల ప్రభాకర్ సతీమణి దేశానికి రక్షణశాఖ మంత్రిగా వున్నారని, అమెతో కలసి ప్రధానిని ఎందుకు ప్రత్యేకహోదా విషయంలో నిలదీయలేరని పవన్ ప్రశ్నించారు. నిర్మలా సీతారామన్ అంధ్రప్రదేశ్ నుంచే రాజ్యసభకు ఎన్నికైన విషయాన్ని కూడా పవన్ ప్రస్తావించారు. మీరు ఎన్నికైన రాష్ట్రానికి కూడా మీరు న్యాయం చేయలేరా..? అని అడిగారు.

తాను ఆవేశంతో, అకతాయితనంతో రాజకీయాల్లోకి రాలేదని, స్ప‌ష్ట‌మైన‌ విధి విధానాలతోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని జనసేనాని అన్నారు. రాజ‌మ‌హేంద్ర వ‌రం ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ప‌వ‌న్ క‌ల్యాన్.. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శుచీ, శుభ్రతా లేకుండా ఆలయాల్లోకి ఎలా వెళ్లకూడదో.. అలానే అలోచన, శుచి లేకుండా రాజకీయాల్లోకి కూడా రాకూడదని అన్నారు. తన పార్టీ కార్యకర్తల కోసం, తాను అశించిన రాజకీయ మార్పుల కోసం అవసరమైతే దెబ్బలు తినేందుకు కూడా తాను సిద్దమని పవన్ మరోమారు పునరుద్ఘాటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jana Sena  Pawan Kalyan  chalore chalore chal  east godavari  west godavari  rajamundry  politics  

Other Articles