pawan kalyan assures his activists will develop ‘‘బీజేపి హటావ్.. టీడీపీ హటావ్’’ ‘‘సీఎం పవన్ కల్యాన్’’

Bjp hatao tdp hatao cm pawan kalyan slognas assures his activists will develop

Jana Sena, Pawan Kalyan, TDP Hatao, BJP Hatao, CM Pawan Kalyan, telugu states tour, political tour, venkatesh, chalore chalore chal, condolence, krishna ferru turndown victims, telangana, msc physics student, murali, Andhra Pradesh, Hyderabad, telugu cinema, Tollywood

fans have kept shouting 'TDP Hatao BJP Hatao' and also 'CM Pawan Kalyan'. And then, the epic reply from the Janasena leader this way. "There is still time to say Party Hatao. We have to speak certain things only at certain times" he asserted.

ITEMVIDEOS: ‘‘బీజేపి హటావ్.. టీడీపీ హటావ్’’ ‘‘సీఎం పవన్ కల్యాన్’’

Posted: 12/06/2017 04:50 PM IST
Bjp hatao tdp hatao cm pawan kalyan slognas assures his activists will develop

విశాఖపట్టణంలో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ చేస్తామని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆత్మహత్యకు పాల్పడిన ఉద్యోగి వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు డిసిఐ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం వ్యక్తం చేసేందుకు వెళ్లిన పవన్ కల్యాన్.. ఉద్యోగులకు తమ మద్దతు తెలిపిన సందర్భంగా అక్కడకు పెద్దసంఖ్యలో విచ్చేసిన పవన్ కల్యాన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు వేధికాస్థలి వద్ద పెద్దఎత్తున నినాదాలు చేశారు.

పవన్ కల్యాన్ మాట్లాడుతున్న నేపథ్యంలోనూ వారు ఈ నినాదాలు అపలేదు. దీంతో పవన్ కల్యాన్ ఒకింత అసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరైన సందర్భంలో సరైన విధంగా స్పందిద్దామని దాటవేత ధోరణిలో సమాధానం ఇచ్చినా అభిమానులు మాత్రం శాంతించలేదు. అసలేం జరిగిందీ..? పవన్ కల్యాన్ ప్రసంగిస్తున్న క్రమంలో అభిమానులు, కార్యకర్తలు పవన్ కల్యాన్ సీఎం అంటూ నినాదాలు చేశారు. ఇంతేనా అంటే అంతటితో అగకుండా బీజేపి హాటావ్.. టీడీపీ హటావ్ అంటూ కూడా నినాదాలు చేశారు. దీంతో పవన్ కల్యాన్ కొంత అసహనానికి గురయ్యారు.

బీజేపి, టీడీపీ హాటావ్ అన్న నినాదాలు చెవిన పడిన పవన్ కల్యాన్ దానికింకా చాలా సమయముందని అప్పడే నినదించడం సరికాదు అని అన్నారు. ప్రస్తుతం మనం అనేక అంశాలపై చర్చించాల్సిన సమయమిదని అన్నారు. పవన్ కల్యాన్ ఇలా అనగానే అభిమానులు బీజేపీ హటావ్, టీడీపీ హటావ్ అన్న నినాదాలను అపేశారు. కానీ సీఎం పవన్ కల్యాన్ అన్న నినాదాలు మాత్రం చేస్తూనే వున్నారు. దీంతో అభిమానులు ఇలాంటి తప్పులు మరలా చేయకూడదని కొంత అగ్రహాన్ని వ్యక్తం చేశారు జనసేనాని.

ఈ సందర్బంగా ‘సీఎం సీఎం అంటే మీకు ఆనందంగా ఉంటుందేమో.. నాకు కాదు. నేను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు. నేను ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చాను. పదవులు రాకపోతే ప్రజలకు సేవ చెయ్యడం మానేస్తామా? ప్రజా సమస్యలపై పోరాడడం మానేస్తామా? లేదు.. నేను అందుకు రాజకీయాల్లోకి రావడం లేదు. పదవుల కోసం రావడం లేదు. పదవులే రాజకీయాల పరమావధి కాదు. కీడెంచి మేలెంచండి... నినాదాలు చేయడం వల్ల నాకు ఆనందం కలుగదు" అంటూ ఆయన అభిమానులకు సున్నితనగా హితవు పలికారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles