pawan kalyan assures his activists will develop జనసేన కార్యకర్తలు మహావృక్షాలు అవుతారు..

Pawan kalyan assures his activists will develop

Jana Sena, Pawan Kalyan, Pawan Kalyan, party activists, vishakapatnam, telugu states tour, political tour, venkatesh, chalore chalore chal, condolence, krishna ferru turndown victims, telangana, msc physics student, murali, Andhra Pradesh, Hyderabad, telugu cinema, Tollywood

Jana Sena party Chief Pawan Kalyan has assured his party activists to develop in future and also says his party will teach all his borther party decievers a lesson soon

ITEMVIDEOS: ‘అన్నయ్య’ ద్రోహులకు గుణపాఠం తప్పదు: పవన్ కల్యాన్

Posted: 12/06/2017 03:45 PM IST
Pawan kalyan assures his activists will develop

జనసేన పార్టీలో ఇవాళ నాటిన చిన్న విత్తనాలే రేపు.. మహావృక్షాలవుతాయని ఆ నమ్మకం, విశ్వాసం తనకు వున్నాయని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి మార్పు కోసం ప్రయత్నం చేస్తే.. దానిని అచరణ సాధ్యం కాకుండా కొందరు అడ్డుకున్నారని.. వారందరికీ త్వరలోనే జనసేన గుణపాఠం చెబుతుందని అన్నారు. ఈ విషయం ప్రస్తావిస్తున్నప్పుడు పవన్ భావోద్వేగానికి గురయ్యారు. తన సోదరుడు పార్టీ వచ్చింది పోయింది.. తనది కూడా అలాంటి పార్టీయేనన్ని విమర్శలు వచ్చాయన్నారు. అయితే తాను సరదాగా పార్టీని స్థాపించలేదన్న విషయాన్ని పవన్ కల్యాన్ తేల్చిచెప్పారు.

అధికార కాంక్ష తనకు లేదని చెప్పిన పవన్.. అధికారం వుంటే ఎంత సేవ చేయగలమోనన్న విషయాలు మాత్రం తెలుసునని అన్నారు. కొన్నాళ్ల క్రితం వరకు సత్యాగ్రహి చిత్రానికి సంబంధించిన కథను రాసుకుంటున్నాని చెప్పిన పవన్.. సినిమాల వల్ల వ్యవస్థల్లో మార్పు రాదని చెప్పారు. అయితే ఆచరణతో మాత్రమే ఇది సాధ్యమని.. తాను అచరించి మరోకరికి ఈ విషయాన్ని చెప్పవచ్చునని అన్నారు. అయితే ఆచరణతో వ్యవస్థల్లో సమూల మార్పులు సాధ్యం అవుతాయని తాను చెప్పడం లేదని.. అయితే సమాజంలో కొంత మార్పుకైనా తమ అచరణ దోహదం చేస్తే చాలునని అన్నారు.

విశాఖ‌ప‌ట్నంలో ప‌ర్య‌టిస్తోన్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌ త‌మ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో పాల్గొని మాట్లాడారు. తన‌కు రాజకీయాల్లోకి రావాల‌ని ఉంద‌ని 2003లో త‌న‌ అమ్మానాన్న‌ల‌కి చెప్పానని అన్నారు. తాను బీజేపీ, టీడీపీ ప‌క్షం కాదని ప్ర‌జ‌ల ప‌క్షం అని అన్నారు. సినిమా త‌న‌కు అన్నం పెట్టిందని, రాజ‌కీయ వ్యవ‌స్థ బాగుంటే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చేవాడిని కాద‌ని ప‌వ‌న్ చెప్పుకొచ్చారు. తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చింది ఏదో సాధించ‌డానికి కాదని అన్నారు. త‌న‌ మ‌న‌స్సాక్షికి స‌మాధానం చెప్పుకునేందుకేనని అన్నారు.

దేశ స్వతంత్ర్య సంగ్రామ సమరయోధులు, తొలి కేంద్రమంత్రుల మండలి సభ్యులు అయిన లాల్ బ‌హ‌దూర్ శాస్త్రి, స‌ర్దార్ ప‌టేల్, నెహ్రూ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ లాంటి నేతల స్ఫూర్తి కొరవడి.. ఏం జరిగినా ఫర్వాలేదని ముందుకు సాగిపోతున్న నేటి రాజకీయ నేతలు తీరుతో భాధకరంగా మారాయని అన్నారు. మ‌న ఆలోచ‌న‌లు వేరు వేరుగా ఉండొచ్చని, లోప‌ల త‌ప‌న మాత్రం ఒకటే ఉంటుందని అన్నారు. జ‌గ‌మంత కుటుంబం మ‌న‌ది, వ‌సుదైక కుటుంబం మనది అని ఆయ‌న చెప్పుకొచ్చారు.  దేశ రాజ‌కీయాల‌కు కొత్త రక్తం కావాలని అన్నారు. మారాల‌ని  చెబితే ఎవ్వ‌రూ మార‌రని, మ‌నం మంచి దారిలో న‌డిచి చూపిస్తే మ‌న‌ల్ని చూసి మార‌తారని అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jana Sena  Pawan Kalyan  party activists  vishakapatnam  chalore chalore chal  politics  

Other Articles