contractor attacks deputy engineer in anantapur డీఈపై నడిరోడ్డు మీద కాంట్రాక్టర్ దాడి.. బెదిరింపులు..

Contractor narasimha reddy attacks deputy engineer in chief kistappa in anantapur

contractor, narasimha reddy, anantapur municipal office, deputy engineer in chief, kistappa, life threat, death warnings, crude bomb, raghuveera complex, anantapur, andhra pradesh crime

contractor narasimha reddy attacks anantapur municipal deputy engineer in chief kistappa at raghuveera complex in anantapur and threatens him to death with crude bomb.

కాంట్రాక్టర్ కౌర్యం: డీఈపై దాడి.. చంపుతానని బెదిరింపులు..

Posted: 12/05/2017 11:36 AM IST
Contractor narasimha reddy attacks deputy engineer in chief kistappa in anantapur

సీమ వాసుల్ని వీడుతున్న ఫాక్షనిజాన్ని తాను మళ్లీ పునికిపుచ్చుకుని ఏకంగా ప్రభుత్వ అధికారులపైనే తన కౌర్యాన్ని ప్రదర్శిస్తున్నాడు ఓ కాంట్రాక్టర్. కాంట్రాక్టర్ గా తన పనులలో నాణ్యత లేదని బిల్లులు అపిన అధికారులను ఏకంగా నడిరోడ్డుపై అపి మరీ దాడి చేస్తున్నాడు. నలుగురు అనుయాయువులను వెంటబెట్టుకుని ప్రభత్వ కార్యాలయానికి వచ్చి.. తన ప్రతాపాన్ని అమాయక ప్రభుత్వ అధికారులపై ప్రధర్శిస్తున్నాడు. కాంట్రాక్టరుగా తన పనితీరు సక్రమంగా వుందా లేదా..? అన్నది పరిశీలన చేసుకోకుండా.. అధికారులపై దాడి చేసి.. బాంబులేసి చంపుతానని బెదిరింపులకు పాల్పడటంపై ఇప్పుడు తెలుగురాష్ట్రాలలో చర్చనీయాంశంగా మారింది. కాంట్రాక్టర్ కౌర్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం నగరపాలక సంస్థలో కిష్టప్ప డిఫ్యూటీ ఇంజనీరుగా విధులు నిర్వహిస్తున్నాడు. చెత్త ఊడ్చే యంత్రం అవసరం కావడంతో.. దానిని నరసింహారెడ్డి అనే కాంట్రాక్టర్ సరఫరా చేశాడు. ఇందుకు గాను ఇప్పటికే అధికారులు రూ.23 లక్షలను చెల్లించారు. కాగా మరో రూ. 15 లక్షల రూపాయలను చెల్లించాల్సి వుంది. ఈ క్రమంలో ఈ యంత్రం లోపభూయిష్టమైనదని అధికారులకు అరోపణలు రావడంతో.. మిగిలిన డబ్బును చెల్లించేందుకు అధికారులు నిరాకరించారు. దీంతో బిల్లు చెల్లింపులో జాఫ్యంతో ప్రశ్నించేందుకు అనంతపురం నగరపాలక సంస్థకు చేరకున్న నరసింహారెడ్డి.. అక్కడి ఇంజనీర్లను అసభ్యపదజాలంతో దుర్భాషలాడాడు.

ప్రభుత్వ కార్యాలయంలో సభ్యత, సంస్కారంతో ప్రవర్తించండీ అంటూ అప్పుడే అక్కడికి వచ్చిన డిఫ్యూటీ ఇంజనీర్ కిష్టప్ప విన్నవించాడు. అంతే రెచ్చిపోయిన నరసింహారెడ్డి నువ్వెవరు నన్న అడిగేందుకంటూ.. అతడిపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. డిప్యూటీ కమిషనర్ సన్యాసిరావు, కార్యదర్శి జ్యోతిలక్ష్మిలు కూడా ఆయనను మందలించారు. కార్పోరేటర్ లక్ష్మారెడ్డి అడ్డుకుని బయటకు లాక్కెళ్లారు. అయితే కార్యాలయంలో అంతమంది వున్నా ఎవరూ నోరు తెరవకపోగా, కిష్టప్ప మాత్రం తనను ప్రశ్నించడంతో అహం దెబ్బతిన్న నరసింహారెడ్డి ఆయనను టార్గెట్ చేశాడు. ఆయనపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు.

ఈ ఘటన జరిగిన గంట తర్వాత బైక్‌పై ఇంటికి వెళ్తున్న కిష్టప్పను మార్గమధ్యంలో అడ్డుకున్న నరసింహారెడ్డి విచక్షణ రహితంగా దాడిచేశాడు. ముఖంపై కాలుపెట్టి బూతులు తిట్టాడు. ‘‘రేయ్ నాది జమ్మలమడుగు, నాతో పెట్టుకుంటే బాంబులు తెచ్చి మీ ఆఫీసుపై వేస్తానని’’ హెచ్చరించాడు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనకు మద్దతుగా నగరపాలక సిబ్బందితోపాటు కాంట్రాక్టర్లు పోలీస్ స్టేషన్‌కు తరలివెళ్లారు. అధికారులపై దాడులను సహించబోమని, ఎస్పీని కలిసి నరసింహారెడ్డిపై చర్యలకు డిమాండ్ చేస్తామని కమిషనర్ మూర్తి తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles