Kerala muslim girls dance goes viral on social media నడిరోడ్డుపై యువతుల అందమైన స్టెప్పులు

Kerala muslim girls dance goes viral on social media

Muslim Girls, Muslim Girls Dance, Muslim Girls dance at Mallapur, Muslim Girls kerala cross roads, hit song, Muslim Girls dance with hijab, Muslim Girls, Dance, Mallapur, hit song, hijab, video viral, Kerala, Viral Video

An intersection of Kerala's Mallapur is being told, where three Muslim girls wearing hijab are dancing to the extreme. The discussion of open-ended dance girls' Muslim girls on the road is increasing rapidly.

ITEMVIDEOS: వైరల్: నడిరోడ్డుపై యువతుల అందమైన స్టెప్పులు

Posted: 12/05/2017 10:37 AM IST
Kerala muslim girls dance goes viral on social media

దేవుడే తన కోసం ప్రత్యేకంగా సృష్టించుకున్న రాష్ట్రం కేరళ అని అక్కడి ప్రకృతిని చూసిన ఎవరైనా అంగీకరించక తప్పని నిజం. కొండలు, కోనలు, మద్యలో నదులు, వాటి పాయలు ఎంతో రమణియంగా సాగే పడవ ప్రయాణాలు.. ఈ అనుభూతిని మాట్లలో చెప్పడం కన్నా.. అస్వాదించిన అనుభూతి మాత్రమే జ్ఞాపకంగా చిరస్థాయిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. అయితే ఇక్కడ దేశవ్యాప్తంగా అన్ని కులమతాలకు ఉన్నట్లుగానే సంప్రదాయాలు, అచారాలు వున్నాయి. అయితే ఇక్కడవారికి వాటి పాలు ఎక్కువే. అయితే తమలో వున్న టాటెంట్ ను మాత్రం దాచుకోవడానికి అయిష్టత వ్యక్తం చేసిన ఓ ముగ్గురు అమ్మాయిలు.. చేసిన డాన్సు ఇప్పుడు సంచలనంగా మారింది.

కేరళలో ఇటీవలి బంపర్ హిట్ సాంగ్ 'జిమ్మిక్కి కమ్మల్’కు వారు ముగ్గురు బాగా ప్రాక్టీసు చేశారు. తమ నృత్యాన్ని ప్రత్యక్షంగా కొందరికి చూపినా.. పరోక్షంగా మాత్రం అందరికీ చూపాలని భావించారు. అంతే కేరళలో మల్లాపూర్ కూడలి వద్దకు చేరకున్న ముగ్గరమ్మాయిలు.. అక్కడ నడిరోడ్డుపై నృత్యం చేస్తూ.. అదిరిపోయే స్టెప్పులు వేసి మరీ ఇరగదీశారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో విపరీతమైన షేర్లతో వీడియో హల్ చల్ చేస్తుంది.

కేరళలోని మల్లాపూర్ క్రాస్ వద్ద ఈ ముగ్గురమ్మాయిలు తమను ఇతరులు గుర్తపట్టకుండా ముఖాలకు ముసుగులు ధరించి మరీ డ్యాన్సు చేశారు. తమ డ్యాన్సుకు సంబంధించిన వీడియోను తీయించిన అమ్మాయిలు దానిని సోషల్ మీడియా వేదికగా తమ స్నేహితులు, బంధువులతో పంచుకున్నారు. అయితే ఈ ముగ్గురూ ధరించిన ముసుగుల అధారాంగీ వీరు ముస్లిం అమ్మాయిలని తెలుస్తుంది. దీంతో ఇస్లాం నిబంధనలకు ఇంత విరుద్ధంగా ప్రవర్తిస్తారా? అని సంప్రదాయ ముస్లిం మతపెద్దలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా, లక్షలాది మంది వారి డ్యాన్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Muslim Girls  Dance  Mallapur  hit song  hijab  video viral  Kerala  Viral Video  

Other Articles