tv actress, broker held doing online prostitution ఆన్ లైన్ లో అనైతికం.. టీవీ నటి అరెస్టు..

Tv actress broker held doing online prostitution

Tv actress, prostitution, sohail, reddy naresh, brothel, malkajgiri, online, prashanth nagar, uppal police, hyderabad, crime

police caught tv actress and one broker who were awaiting for the broker on a road near prashanth nagar at uppal. the deal was done online.

ఆన్ లైన్ లో అనైతికం.. టీవీ నటి అరెస్టు..

Posted: 11/30/2017 03:31 PM IST
Tv actress broker held doing online prostitution

టెక్నాలజీలో వస్తున్న మార్పులను ఓ వైపు దేశాభివృధ్దికి వినియోగించుకుని యువత ముందుకు దూసుకువెళ్తున్న క్రమంలో.. దానినే అసత్రంగా మలుచుకుని సభ్య సమాజం తలదించుకునే పనులకు వినియోగిస్తున్నారు కొందరు సంఘవిద్రోహశక్తులు. వక్రమార్గంలో రాత్రికి రాత్రే కాసుల వర్షం కురిపించేలా ఎలాంటి వ్యయప్రయాస లేకుండా జీవితం గడిచిపోవాలని, అప్పనంగా వచ్చిన డబ్బుతో తమ పబ్బం గడుపుకోవాలని యత్నించే అక్రమార్కులు.. సాంకేతికంగా వస్తున్న మార్పులను కూడా తమ స్వార్థానికి వినియోగిస్తున్నారు. ఇందులో బుల్లితెర చెందిన నటీ కూడా పట్టుబటడంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఆన్‌ లైన్‌ మాధ్యమంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ తెలుగు టీవీ నటి పోలీసులకు పట్టుబడింది. ఉప్పల్ పోలీసులు తెలిపిన మరిన్ని వివరాల ప్రకారం, కృష్ణానగర్‌ కు చెందిన సోయల్‌, రెడ్డి నరేష్ నాయుడు అనే ఇద్దరూ ఆన్ లైన్ లో ప్రకటనలు ఇచ్చి విటులను ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి, బుల్లితెర నటి చిత్రాన్ని చూసి ఆమెను బుక్ చేసుకోగా, ఆమెను ఉప్పల్‌ ప్రశాంత్‌ నగర్‌ కు పంపించారు. ఈ సమాచారాన్ని తెలుసుకున్న మల్కాజ్ గిరి ఎస్‌ వోటీ విభాగం పోలీసులు, ప్రశాంత్‌ నగర్‌ రోడ్డులో బుక్ చేసుకున్న విటుడి కోసం వేచిచూస్తుండగా, నటితో పాటు రెడ్డి నరేష్ నాయుడిని అరెస్ట్ చేశారు. ఆపై వారిని ఉప్పల్ పోలీసులకు అప్పగించామని, కేసు నమోదు చేశామని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tv actress  prostitution  sohail  reddy naresh  brothel  malkajgiri  online  prashanth nagar  uppal police  hyderabad  crime  

Other Articles