Automation could impact 375 million jobs by 2030 వ్యవసాయానికి మంచిరోజులు ఇలా వస్తున్నాయా.?

Robots could take up 800 million jobs by 2030 mckinsey report

BOTZ, ROBO, SPX, Global X Robotics Artificial Intelligence ETF, ROBO Global Robotics Automation Index ETF, SP 500 Index, Markets, US, Canada, India, Japan Germany, china, Mckinsey Report, robotics, automation, artificial intelligence, 800 million jobs, India, employement

According to a new study by McKinsey & Co., the fallout from this issue could be tremendous, with tens of millions of jobs impacted worldwide in the coming years.

షాకింగ్ న్యూస్: ఊడిపోతాయ్.. ‘ఉద్యోగ’స్థులు తస్మాత్ జాగ్రత్తా..

Posted: 11/30/2017 01:15 PM IST
Robots could take up 800 million jobs by 2030 mckinsey report

ప్రపంచవ్యాప్తంగా శాస్త్రసాంకేతిక రంగాల్లో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులు.. ఇప్పటికే కంప్యూటర్ల అనుసంధానంతో వచ్చిన సీఎన్సీ మెషీన్లు పరిశ్రమల్లో కార్మికులను నిరుద్యోగులుగా మార్చితే.. అటు ఐటీ రంగంలోకూడా వేగంగా వస్తున్న మార్పులు కూడా ఉద్యోగస్థులను నిరుద్యోగులుగా మార్చివేస్తుంది. ఇప్పటికే ఐటీ రంగంలో ఉద్యోగాలు తుమ్మితే ఊడిపోయే ముక్కులా తయారైన నేపథ్యంలో ప్రముఖ రీసెర్చ్ సంస్థ మెకీన్సే మరో సంచలన విషయాన్ని వెల్లడించి ఉద్యోగస్థులలో అందోళన రేపింది.

మళ్లీ వ్యవసాయమే నయమన్న వెనకటి రోజులు వస్తున్నాయా..? వ్యవసాయానికి సాంకేతికతను జోడించి ఆ రంగంలో ఉత్పాదకతను పెంచే బృహత్తర మార్పులు రానున్నాయా..? అన్న సందేహాలను తెరపైకి తీసుకువస్తుంది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా రోబోటిక్ సైన్స్, ఆటోమేషన్ వంటి అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంపై ఎక్కువ అసక్తి కనబరుస్తుందని వీటి వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగస్థులకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని అంటోంది ఈ సంస్థ. ఈ ప్రమాధం బారిన భారత్ కూడా పడనుందని రీసర్చ్ సంస్థ వెల్లడించింది. వీటి ఫలితంగా 2030 నాటికి ఇండియాలో 11 నుంచి 12 కోట్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని సంస్థ అంచనా వేసింది.

అతి ఎక్కువ ఉద్యోగాలను చైనా కోల్పోనుందని... ఈ దేశంలో 20 కోట్ల మందికి పైగా ఉద్యోగాలను కోల్పోతారని తన నివేదికలో పొందుపరిచింది. చైనా, భారత్, అమెరికా, మెక్సికో, జపాన్ దేశాలు రోబోలు, ఆటోమేషన్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నాయని తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా 2030 నాటికి ఏకంగా 80 కోట్ల మంది నిరుద్యోగులు కానున్నారని మెకిన్సే స్పష్టం చేసింది. అమెరికాలో మూడింట ఒక వంతు మంది ఉద్యోగాలను కోల్పోతారని అంచనా వేసింది. అభివృద్ధి చెందిన దేశాలే కాక... వర్ధమాన దేశాలు కూడా ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోబోతున్నాయని చెప్పింది.

ఆటోమేషన్ త్వరగా విస్తరిస్తోందని... దీని ప్రభావంతో మెషీన్ ఆపరేటర్లు, బ్యాక్ ఆఫీస్ ఉద్యోగులు, ఫాస్ట్ ఫుడ్ వర్కర్లు ఎక్కువగా నష్టపోతారని చెప్పింది. నైపుణ్యత కలిగిన ఉద్యోగాలు, నిర్వహణా ఉద్యోగాలపై కూడా భారీ ప్రభావం పడనుందని తెలిపింది. 46 దేశాల్లో సర్వే చేసిన మెకిన్సే... ఈ మేరకు తన నివేదికలో పొందుపరిచింది. ఉద్యోగాలను కోల్పోయిన వారు కొత్త ఉద్యోగాలను వెతుక్కోవడం కూడా కష్టమవుతుందని... దీనికి తోడు విద్యను పూర్తి చేసుకున్నవారికి కూడా చాలా కష్టాలు ఎదురవుతాయని చెప్పింది. ఇదంతా జీతాలపై కూడా ప్రభావం చూపుతుందని తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mckinsey Report  robotics  automation  artificial intelligence  800 million jobs  India  employement  

Other Articles