తనకు కాంగ్రెస్ పిసిసీ పదవిని ఇస్తే ఎంతటి శ్రమకైనా ఓర్చి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పినా.. తన మాటలను లక్ష్యపెట్టని అధిష్టానం తనకు పదవిని నేపథ్యంలో నల్గోండ జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి సోదరులు పార్టీ మారుతున్నారన్న వార్తలు ప్రముఖంగా వినిపించాయి. అయితే విటిపై ఎట్టకేలకు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందించారు. తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన క్లారిటీ ఇచ్చారు.
తాను కొత్త పార్టీని స్థాపిస్తున్నానని, అందులో భాగంగానే ప్రముఖ పాత్రికేయుడు, ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావును కలిసినట్టు వచ్చిన వార్తలపై కూడా ఆయన స్పందించారు. మొదటగా తాను పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను తన అభిమానులు, కార్యకర్తలు ఎవరూ నమ్మవద్దని కోరారు. ఇలాంటి తప్పుడు వార్తలను కొందరు తనకు వ్యతిరేకంగా కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
ఇక తాను కొత్తగా పార్టీని ఏర్పాటు చేస్తున్నానని వస్తున్న వార్తలు కూడా సత్యదూరమైనవేనని అన్నారు. మర్యాద కోసం రామోజీరావును కలిసినంత మాత్రాన అక్కడ ఏదో జరిగిందన్న కథనాలు సృష్టించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. తాను ఎటువంటి పక్షంలో కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లనని చెప్పుకోచ్చిన ఆయన తాను చనిపోయిన తర్వాత కూడా తనపై కాంగ్రెస్ జెండానే ఉంటుందని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more