Giddi Eswari video Footage on defection టీడీపీలో గిడ్డి ఈశ్వరీ చేరికపై వివాదం.. వీడియో వైరల్

Giddi eswari video footage on defection goes viral

visakhapatnam, paderu mla, Giddi Eswari, TDP, YSRCP, party activists, viral video, sc st attrocities act, YS Jagan, social media, video viral

visakhapatnam paderu mla Giddi Eswari who joins TDP defecting YSRCP recently had consoled her party activists on joining TDP, This video goes viral on social media

టీడీపీలో గిడ్డి ఈశ్వరీ చేరికపై వివాదం.. వీడియో వైరల్

Posted: 11/29/2017 03:48 PM IST
Giddi eswari video footage on defection goes viral

ప్యాకేజీలో లేక మంత్రి పదవులో ఇచ్చి తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకుంటున్నారని, ఇలాంటి దిగజారుడు రాజకీయాలను అధికార టీడీపీ ప్రోత్సహించడం సమంజసం కాదని అంధ్రప్రదేశ్ విపక్ష పార్టీ ఇప్పటికే పలుమార్లు అరోపించింది. అయితే తన పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడమే చేతకాక అ పార్టీ అధినేత జగన్ ఇలా మాట్లాడుతున్నాడని టీడీపీ పార్టీ నేతలు ఫిరాయింపుల వెనుక ఎలాంటి ఒప్పందాలు లేవని గత మూడున్నరేళ్లుగా ఖండిస్తూనే వస్తున్నారు. అయితే తాజాగా మాత్రం గిడ్డి ఈశ్వరికి సంబంధించిన వీడియో ఒకటి మీడియాకు చిక్కి.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైసీపీ వదలి టీడీపీలోకి వెళ్లగానే తనకు మంత్రి పదవి వస్తుందని, వెళ్లి వెళ్లగానే తనకు మంత్రిపదవిని ఇస్తే సమంజసంగా వుండదు కాబట్టి ముందుగా క్యాబినెట్ హోదా కలిగిన ఎస్టీ చైర్మన్ పదవిని ఇవ్వనున్నారని ఈ మేరకు అధికార పార్టీతో ఓప్పందం కుదిరిందని.. అంతేకానీ చంద్రబాబు అంటే నాకేమీ ఇష్టమని వెళ్లడం లేదని అమె చెప్పినట్లు అమె గొంతుతో వినిపిస్తున్న ఓ వీడియో తాజాగా మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఎలాంటి ప్యాకేజీలు, డీల్ లు లేవని ఖండిస్తున్న టీడీపీ నేతల నోట్లు పచ్చి వెలక్కాయ పడినట్లు చేసింది ఈ విడియో.

డిఫర్‌ అవడం వల్లనే వెళ్లాల్సి వస్తోంది. నేను ఏం చెబుతున్నానంటే, మంత్రివర్గ విస్తరణ రేపు జరిగితే రేపు, ఎల్లుండి జరిగితే ఎల్లుండి మంత్రి పదవిని ఇస్తామన్నారు.. వెంటనే మంత్రి పదవి ఇవ్వలేరు కాబట్టి ఎస్టీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవిని క్యాబినెట్‌ హోదాతో ఇస్తామన్నారు. రాష్ట్రంలోని మంత్రికి ఉన్నటువంటి పవర్స్‌ అన్నీ ఇస్తామన్నారు కాబట్టే వెళ్తున్నా" అని పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి తన కార్యకర్తలను సముదాయిస్తున్న వీడియో తమకు లభించిందని 'సాక్షి' దినపత్రిక వెల్లడించింది.

ఎన్నికలకు ముందు కేవలం ఒక్క  ఏడాది సమయం మిగిలివున్న తరుణంలో పార్టీ పిరాయింపుకు పాల్పడటం ఎందుకని పార్టీ నేతలు ప్రశ్నించగా, అమె వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. టీడీపీలో చేరేందుకు తన ముఖ్యకార్యకర్తలతో సమావేశం నిర్వహించిన క్రమంలో అమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఇక ఈ వీడియో వైరల్ కావడంలో ఈవ్వరి తనను వైసీపీ నేతలు మానసికంగా వేధిస్తున్నారని అరోపించారు. తాను జగన్ పైన ఎస్సీ, ఎస్టీ అక్ట్రాసిటీ కేసు పెడతానని కూడా చెప్పారు.  మరి వీడియలో ఏముందో కూడా చూడండి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles