High court blow to Telangana on TRT Exam టీఆర్టీ నోటిఫికేషన్ మళ్లీ విడుదల చేస్తామన్న సర్కార్

High court blow to telangana government on teachers recruitment

telangana goverment, teacher recruitment test, dsc, tspsc, 10 districts, presidential order, high court, Chief Justice Ramesh Ranganathan, Justice G Shyam Prasad, 31 districts, hyderabad high court

Hyderabad High Court made it clear that the Telangana government cannot amend the Presidential Order and directed it to complete the ongoing teachers recruitment by taking the erstwhile 10 districts of Telangana

టీఆర్టీ నోటిఫికేషన్ మళ్లీ విడుదల చేస్తామన్న సర్కార్

Posted: 11/25/2017 09:12 AM IST
High court blow to telangana government on teachers recruitment

తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టులో చుక్కెదురైంది. ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)కు సంబంధించి జీవో నంబర్ 25ను సవరించాల్సిందేనంటూ ఇవాళ హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రపతి అర్డర్ కు భిన్నంగా నోటిఫికేషన్ జారీ చేయడాన్ని తప్పుబట్టింది. కొత్తగా ఏర్పడిన 31 జిల్లాల ఆధారంగా టీఆర్టీ నోటిఫికేషన్ ను జారీ చేయడం రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకమని పేర్కొంది.

నూతనంగా ఏర్పాటు చేసిన 31 జిల్లాలను పరిగణలోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాద్యయ నియామక పరీక్షలను నిర్వహించడం వల్ల పాత జిల్లాల వారీగా స్థానికులమైన తాము.. కోత్త జిల్లాల పరంగా పక్క జిల్లాలకు నాన్ లోకల్ అభ్యర్థులుగా మారుతున్నామంటూ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన అరుణ్ కుమార్ సహా మరో ముగ్గురు హైకోర్టులో పిటిషన్ వేశారు. తమకు న్యాయం చేయాల్సిందిగా పిటీషన్ లో అభ్యర్థించారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలోని పాత 10 జిల్లాలకే రాష్ట్రపతి ఆమోదం ఉందని... కొత్త జిల్లాలకు ఆమోదం లేదని వీరి తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. రాష్ట్రపతి ఆమోదం లేనప్పుడు 31 జిల్లాలను పరిగణనలోకి తీసుకోవడం చెల్లదని కోర్టుకు తెలిపారు. కొత్త జిల్లాల వల్ల పాత జిల్లాలలో స్థానికేతరులుగా అభ్యర్థులు నష్టపోతున్నారని అన్నారు. దీంతో, 10 జిల్లాల ప్రకారమే టీఆర్టీ నోటిఫికేషన్ జారీ చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది.  

హైకోర్టు అదేశాలకు లోబడిన ప్రభుత్వం.. తన వైఖరిని మార్చుకుంది. పది జిల్లాలను పరిగణలోకి తీసుకునే మరోసారి టీఆర్టీ నోటిషికేషన్ విడుదల  చేస్తామని స్పస్టం చేసింది. ఇక దీనికి దరఖాస్తు చేసుకునే గడువును కూడా మరో పక్షం రోజుల పాటు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది హైకోర్టు విన్నవించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles