Massacre: More than 200 Killed in Egypt Mosque Attack మసీదులో మారణహోమం.. 235 మంది దుర్మరణం

Mosque attack is the deadliest in egypt s modern history claims 235 lives

Egypt terror attack, Egypt attack, terror attack in egypt, egypt bloodshed, egypt massacre, Raveesh Kumar, Sinai Peninsula

A terrorist attack on a mosque in Egypt’s troubled North Sinai region is the deadliest terrorist attack in Egypt’s modern history.

మసీదులో మారణహోమం.. 235 మంది దుర్మరణం

Posted: 11/24/2017 07:47 PM IST
Mosque attack is the deadliest in egypt s modern history claims 235 lives

ఈజిప్టులో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. సినాయ్‌ ద్వీపకల్పంలోని బిర్‌ అల్‌-అబెద్‌ పట్టణంలో నరమేధానికి పాల్పడ్డారు. అల్‌-రౌదా మసీదుపై దాడిచేసి నెత్తుటేరులు పారించారు. ఈ దారుణ ఘటనలో కనీసం 235 మంది మృతి చెందగా, మరో 110 మందికి గాయాలయ్యాయి. శుక్రవారం ప్రార్థనలు చేస్తున్న వారిపై కొందరు దుండగులు నాలుగు వాహనాల్లో వచ్చి దాడిచేసినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మసీదుపై బాంబులు విసిరి, విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు.భద్రతాబలగాలకు సహకరిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకొని ఈ దాడికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాంబు పేలుడు తర్వాత ప్రాణభయంతో పరుగులు తీస్తున్న వారిపై కాల్పులు జరిపారు.
 
రక్తపు మడుగుల్లో పడి ఉన్న మృతదేహాలతో మసీదు లోపల భయానక దృశ్యాలు కనిపించాయి. తెగిన శరీర భాగాలతో క్షతగాత్రుల రోదనలు మిన్నంటాయి. సుమారు 50 అంబులెన్సుల్లో క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డ వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉండడంతో, మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ మారణకాండ నేపథ్యంలో ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్‌ ఫత్తా అల్‌సీసీ భద్రతా అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఉగ్రదాడిని ఖండించిన ప్రభుత్వం.. మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది.
 
కాగా, ఈజిప్టులో ఇటీవలి కాలంలో ఇస్లామిక్‌ తీవ్రవాదులు తిరుగుబాటుకు ప్రయత్నిస్తున్నారు. 2013లో మహమ్మద్‌ మోర్సీని గద్దె దించిన తర్వాత ఈ దాడులు తీవ్రతరమయ్యాయి. నాటి నుంచి జరుగుతున్న దా డుల్లో వందలాది సైనికులు, పోలీసులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఇస్లామిక్‌ స్టేట్‌కు అనుబంధంగా ఉన్న సినాయ్‌ ప్రావిన్స్‌ గ్రూపు ప్రధానంగా దాడులకు దిగుతోంది. ఈ మధ్యకాలంలో జరిగిన ఉగ్రవాడుల్లో ఇదే అతి పెద్దది. అయితే ఈ దాడి వెనక ఎవరున్నారనేది ఇంకా తెలియరాలేదు. కాగా ఈ మారణకాండను భారత ప్రధాని మోదీ ఖండించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles