vijayashanti assured of aicc key post విజయశాంతికి కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు..

Senior politician vijayashanti assured of aicc key post

congress leader, former TRS MP, ACtress, Politician, vijaya shanti, Aicc key post, congress publicity committee, Rahul gandhi, Telangana incharge kuntiya, telangana pcc chief uttam kumar reddy

Actress turned politician, Telangana senior leader vijaya shanti is assured of getting aicc key post after meeting aicc vice president rahul gandhi.

విజయశాంతికి కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు..

Posted: 11/07/2017 08:39 PM IST
Senior politician vijayashanti assured of aicc key post

సినీ నటి, మాజీ ఎంపీ, తెలంగాణ సీనియర్ నేత విజయశాంతికి తెలంగాణ కాంగ్రెస్ లో సముచిత స్థానం దక్కనుందా..? అంటే అవునన్న సంకేతాలే వినబడుతున్నాయి. గత ఎన్నికల్లో మెదక్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విజయశాంతి, డిప్యూటీ స్పీకర్‌ పద్మా దేవందర్‌ రెడ్డి చేతిలో ఓటమి చెందిన నాటి నుంచి అమె కాంగ్రెస్ పార్టీతో కొంత దూరంగానే వుంటూ వచ్చారు. అయితే ఇటీవల తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయమన్న అంచనాలకు తోడు తెలంగాణ టీడీఎల్పీ నేత రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరడంతో.. అమె కొంత కినుకు వహించారని సమాచారం.

దీంతో విజయశాంతిని తమ పార్టీ మిస్ చేసుకోవడం ఇష్టంలేని టీపీసీసీ అద్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అమెతో చర్చలు నిర్వహించారు. తన ఓటమి తరువాత పార్టీ తనను దూరం పెట్టిందని, తనకు పార్టీలో సముచిత స్థానం కూడా కల్పించలేదని అమె అసంతృప్తిని వ్యక్తం చేశారని సమాచారం. దీంతో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ రామచంద్ర కుంతియా సహా ఉత్తమ్ కుమార్ రెడ్డిలు అమెను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యేలా చోరవ తీసుకున్నారు. పార్టీలో అమెకు సముచిత స్థానంతో పాటు గౌరవం కూడా లభిస్తుందని రాహుల్ హామీ ఇచ్చారని సమాచారం.

దీంతో మళ్లీ లేడీ అమితాబ్ కాంగ్రెస్ రాజకీయాలలో చక్రం తిప్పనున్నారు. పార్టీలో కీలకమైన పోస్టుతో పాటు ఎన్నికల ప్రచార కమిటీలో స్థానం కూడా కల్పిస్తామని హామీ రావడంతో అమె ఇక క్రియాశీలక రాజకీయాల్లోకి ఎంట్రీ కాబోతున్నారు. తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె చురుకుగా పాల్గొననున్నారు. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి ఆర్‌సీ కుంతియా తెలిపారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపే లక్ష్యంగా అమె పనిచేస్తారని ఈ మేరకు విజయశాంతి రాహుల్ గీంధీకి హామి ఇచ్చారని పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijaya Shanti  Rahul Gandhi  Rama chandra Kuntiya  Uttam Kumar Reddy  Telangana  TRS  Congress  

Other Articles