Petrol prices predicted to jump in coming weeks ఇంధనం ధరలకు మళ్లీ రెక్కలు.. రూ.74 దాటిన పెట్రోల్

Fuel prices to cost more as crude oil hits 28 month high

oil price, brent crude oil price, fuel price, petrol price, diesel price, brent $60, rbi, fiscal stimulus, excise duty, vat, delhi, GST, fuel prices, business

Fuel prices are set to rise further despite recent excise duty cut as Brent crude, the global benchmark for oil trade, hit yet another high on Monday at $62.39.

ఇంధనం ధరలకు మళ్లీ రెక్కలు.. రూ.74 దాటిన పెట్రోల్

Posted: 11/07/2017 04:20 PM IST
Fuel prices to cost more as crude oil hits 28 month high

ఇంధన ధరలకు మళ్లీ రెక్కలు రానున్నాయి. ఇప్పటికే పెట్రోల్ ధరలు 74 రూపాయల గీత దాటగా, అటు డీజల్ కూడా 63కు పైన కోనసాగుతుంది. అక్టోబర్ మాసంలోని తొలినాళ్లలో ఇంధన ధరలు పెరగడంతో అధికారంలోకి వచ్చిన కొత్తగా అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా.. కేంద్రం మాత్రం సుమారు తొమ్మిది రూపాయల మేర వడ్డిండిన ఎక్సైజ్ పన్నులోంచి రెండు రూపాయలను తగ్గించగా, ఆ తరువాత ఆ నెలవ్యాప్తంగా గణనీయంగా పెట్రోల్ ధరలు తగ్గిన విషయం తెలిసిందే.

కాగా, అక్టోబర్ ముగిసి నవంబర్ నెల వచ్చేసరికి మళ్లీ ఇంధర ధరలకు మళ్లీ రెక్కటు వచ్చాశాయి. అంతేకాదు రానున్న రోజుల్లో ఈ ధరలు మరింతగా పెరగనున్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇందుకు అంతర్జాతీయ మార్కెట్ పెరుగుతున్న ముడిచమురు ధరలే కారణం. దీనికి తోడు సౌదీ అరేబియా రాజ కుటుంబంలోని పరిణామాల ప్రభావం చమురు మార్కెట్ పై పడింది. రెండేళ్లలో మొదటిసారిగా బ్యారెల్ ముడి చమురు 60 డాలర్లు దాటింది. ప్రస్తుతం బ్యారెల్ ముడి చమురు ధర 64 డాలర్లుగా ఉంది. ఒక్క సోమవారమే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర 3.5 శాతం పెరిగింది. ఒక్క రోజే ముడిచమురు ధర రెండున్నర డాలర్లు పెరగడంతో భవిష్యత్‌లో మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. వారం రోజుల్లో ముడిచమురు బ్యారెల్ 70 డాలర్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు.
 
2015 జులై తర్వాత క్రూడాయిల్‌కు అత్యధిక ధర ఇప్పుడే పలుకుతోంది. ముడిచమురు ధరలు పెరగడంతో కేంద్రం రూ. 2 ఎక్సైజ్ సుంకాన్ని గత నెలలోనే తగ్గించింది. అయితే ప్రతీరోజు పెట్రోల్ ధర ఎంతోకొంత పెరుగుతుండడంతో వినియోగదారునికి ఊరట లభించడం లేదు. సెప్టెంబర్‌లో దేశంలో చమురు వినియోగం 9.9 శాతం పెరిగింది. ప్రస్తుతం తెలంగాణలో లీటరు పెట్రోల్ ధర రూ. 74. డీజిల్ లీటర్ 63.29. ఆంధ్రాలో పెట్రోలు లీటరు రూ. 76, డీజిల్ లీటర్ 65.29 గా ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles