child miraculously survies by a huge lightning bolt ఈ చిన్నారి చిరంజీవే.. గట్టిగా కేకలు వేసిన తల్లి

Terrifying moment child is almost hit by a huge lightning bolt

lightning, bolt, hit, terrifying, lightning strike, lightning strikes, lightning crashes, Terrifying moment child is almost hit by a huge lightning bolt, storm, 12-year-old boy, 12-year-old boy, heavy rain, umbrella, Carolina Kotur, Paraguayan town, San Pedro del Parana, Posadas, Argentina

The horrifying moment a boy, 12, playing with an umbrella in the rain is hit by a lightning bolt – and miraculously survives

ITEMVIDEOS: ఈ చిన్నారి చిరంజీవే.. గట్టిగా కేకలు వేసిన తల్లి..

Posted: 10/24/2017 04:23 PM IST
Terrifying moment child is almost hit by a huge lightning bolt

ఈ చిన్నారి నిజంగా చిరంజీవే. పన్నెండేళ్ల బాలుడు వర్షంలో అడుకునేందుకు గొడుగు సాయంతో తన ఇంటి లాన్ లోకి వెళ్లి అడుకుంటుండగా, అతనికి పక్కనే పడిన పిడుగు నుంచి వెంట్రుకవాసిలో తప్పించుకున్నాడు. అతని గొడుగుపై పడిన పిడుగు గొడుగులు ఒక్క ఉదుట్టున బస్మం చేసింది. అయితే ఈ బాలుడి మాత్రం నిజంగా అదృష్టవంతుడనే అంటున్నారు ఆ తల్లి సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో చూసిన నెట్ జనులు. అయితే ఈ వీడియోను పోస్టు చేసిన తల్లి మాత్రం తనలాంటి తల్లిదండ్రులకు ఓ సూచన చేస్తుంది.

వివరాల్లోకి వెళ్తే... అర్జెంటీనాలోని పొసాడాస్ ప్రాంతంలోని సాన్ పెడ్రో డెల్ పెరానా పరిధిలోగల పారాగ్యున్ నగరంలోతెల్లవారు జామున వర్షం పడుతోంది. డ్రెయిన్ పైప్ నుంచి నీరు ధారగా కిందపడుతోంది. వర్షంలో అడుకునేందకని 12ఏళ్ల చిన్నారు గొడుగును తీసుకుని బయటకు వెళ్లాడు. ఇక తన కూతురుకు ఉరుములు, మెరుపులంటే భయంకావడంతో ఇంట్లో అమెకు ధైర్యంగా వున్నా తల్లి కరోలినా కొటుర్.. కిటికీలోంచి  తమ కొడుకు అడుకుంటున్న వీడియోను సరదాగా తీసింది.

ఇక అడుకుంది చాలు ఇంట్లోకి రమ్మని తల్లి పిలుస్తుండగా, పిల్లాడు లాన్ లోకి వెళ్లేందుకు అడుగులు వేస్తుండగా, అకస్మాత్తుగా ఒక పిడుగు సరిగ్గా పిల్లాడి గోడుగుపై పడి భూమిలోకి ఇంకిపోయింది. అంతే ఆ తల్లి గుండె అగిపోయింది. గట్టిగా కేకులు వేస్తూ అరచేసింది. కానీ తన బిడ్డకు ఏం కాలేదని తెలుసుకుని వెంటనే కొడుకు వద్దకు పరుగుతీసింది. అదే సమయంలో బిత్తరపోయిన పిల్లాడు.. హతాశుడై తన తల్లి చెంతకు చేరుకున్నాడు. దీంతో ఆ తల్లి  హాయిగా ఊపిరిపీల్చుకుంది.

ఈ ఘటనలో తన బిడ్డకు ఏమీ కాలేదని, అయితే ఇందుకు తాను భగవంతుడికి ముందుగా ధన్యవాదాలు చెబుతున్నానని చెప్పిన కరోలినా.. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దాంతో పాటు తనలాంటి తల్లిదండ్రులందరకీ ఒ విన్నపాన్ని కూడా చేసింది. 'ఇలా ఎప్పుడూ మీ పిల్లల్ని వర్షంలో ఆడుకోనివ్వకండి' అంటూ ఆమె తల్లిదండ్రులకు సందేశాన్ని ఇస్తోంది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో చూడండి. వీడియోలో పిడుగు పడడం స్పష్టంగా కనిపిస్తుంది. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles