Hardik Patel gives signs of supporting ‘chor’ Congress: కాంగ్రెస్ దొంగే కానీ.. అంటున్న హార్థిక్ పటేల్

To defeat mahachor bjp we can support chor congress hardik patel

hardik patel calls congress chor, but bjp maha chor, hardik patel calls congress chor, hardik patel calls bjp maha chor, hardik patel, rahul gandhi, narendra modi, congress, bjp, Gujarat elections

The Congress has invited Dalit leader Jignesh Mewani and Patidar leader Hardik Patel for talks with Rahul Gandhi ahead of the Gujarat assembly elections.

కాంగ్రెస్ దొంగే కానీ.. అంటున్న హార్థిక్ పటేల్

Posted: 10/24/2017 01:27 PM IST
To defeat mahachor bjp we can support chor congress hardik patel

పటీదార్ ఉద్యమ నేత హార్థిక్ పటేల్.. రానున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో జతకడతారని సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో ఆయన నిన్న రాత్రి రహస్యంగా కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ బసచేసిన స్టార్ హోటల్ లోకి వెళ్లారని వార్తలు గుప్పుమన్న తరుణంలో ఆ వార్తలను ఖండించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీని కూడా తిట్టేశారు. కాంగ్రెస్ దొంగ (చోర్) అని పేర్కోన్నారు. అయితే బీజేపీ 'గజదొంగ' (మహాచోర్‌) .అని అభివర్ణించిన ఆయన దానిని ఓడించాలంటే.. కాంగ్రెస్‌ కు మద్దతిస్తే మాత్రం తప్పేంటని ప్రశ్నించారు. పరోక్షంగా కాంగ్రెస్‌ పార్టీకి మద్దతునిస్తానంటూ ఆయన సంకేతాలు ఇచ్చారు.

రాహుల్ గాంధీ బసచేసిన అహ్మదాబాద్ హోటల్ కు తాను వెళ్లిన మాట నిజమని అంగీకరించిన ఆయన తాను కాంగ్రెస్ ఉపాధ్యక్షునితో భేటీ అయ్యానన్న వార్తలను మాత్రం తీవ్రంగా ఖండించారు. తాను రాహుల్ సుదీర్ఘంగా రానున్న ఎన్నికలలో పోత్తులపై చర్చించుకున్నామన్న వార్తలు సత్యదూరమని వివరణ ఇచ్చారు. ఉత్తర గుజరాత్లో రోడ్ షో, బహిరంగ సభల కారణంగా రాహుల్ తో సమావేశానికి వెళ్లలేకపోయానని ఆయన చెప్పుకొచ్చారు.

కాంగ్రెస్ ఆహ్వానం మేరకు తాను హోటల్‌కు వెళ్లానని, అయితే, ఆలస్యం అవుతుండటంతో తాను అశోక్‌ గెహ్లాట్ ను మాత్రమే కలిసి వెనుకకు వచ్చానని చెప్పారు. బీజేపీ వాళ్లు హోటల్ సీసీటీవీ దృశ్యాలను తెప్పించుకొని.. వాటిని కావాలనే లీక్‌ చేశారని, గుజరాత్‌లో ఉన్నది ప్రతిదీ తమ ఆస్తి అన్నట్టు బీజేపీ తీరు ఉందని ఆయన విమర్శించారు. తానేమీ ప్రధాని నరేంద్రమోదీ లాగా పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్ ను కలువలేదని హార్థిక్ పటేల్ విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hardik patel  rahul gandhi  narendra modi  congress  bjp  Gujarat elections  

Other Articles