Major Fire at Yarn Mill Near Shingar Cinema లక్షల అస్తి బుగ్గిపాలు.. అల్లికల పరిశ్రమలో మంటలు

Massive fire erupts at hosiery unit in punjab s ludhiana no casualties

fire in ludhiana, punjabs ludhiana, Shingaar Cinema, Fire breaks out, Major blaze, Blaze at factory, Ludhiana, hosiery, crime

A massive fire broke out at a hosiery unit in Punjab's Ludhiana this morning, police said. The building is located close to the Shingaar Cinema on Samrala Road.

లక్షల అస్తి బుగ్గిపాలు.. అల్లికల పరిశ్రమలో మంటలు

Posted: 10/24/2017 12:49 PM IST
Massive fire erupts at hosiery unit in punjab s ludhiana no casualties

పంజాబ్ రాష్ట్రంలోని లుథియానాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. షింగర్‌ థియేటర్‌ సమీపంలోని ఓ భవనంలో మంటలు చెలరేగాయన్న సమాచారంతో రంగంలోకి దిగిన అగ్నిమాపక దళాలు మంటలను అర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాగా మంటలు ఉదయంపూజల వీచిన గాలి కూడా తోడవ్వడంతో అగ్నికి అజ్యం పోసినట్లు అయ్యింది పరిస్థితి. దీంతో మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయి. పరిసర ప్రాంతాల్లో దట్టమైన నల్లని పొగ అలుముకుంది.. దీంతో మరిన్ని అగ్రిమాపక దళాలు రంగంలోకి దిగగా, మొత్తంగా 12 శకటాలు మంటలను అర్పేందుకు శ్రమిస్తున్నాయి.

ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల ప్రాంతాల వారిని ఖాళీ చేయించిన అగ్నిమాపక అధికారులు.. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని అనుమానిస్తున్నారు. మహారాజా రంజిత్ సింగ్ పార్క్ ప్రాంతంలోని ఓ భవంతిలో అల్లికల పరిశ్రమను నిర్వహిస్తున్నారు. అయితే విద్యుత్ఘాతం వల్ల మంటలు రేగి.. అవి వ్యాపించడంతో పరిశ్రమలోని లక్షలాధి రూపాయల వస్తువులు బుగ్గిపాలయ్యాయి. అయితే అందులో తయారు చేసిన వస్తువులతో పాటు.. అల్లికల వస్తువులను తయారుచేసేందుకు వినియోగించే సామాగ్రి కూడా వుందని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి.

అయితే ఇరుకైన రోడ్డు, పరిశ్రమలో మంటలను అదుపులోకి తీసుకువచ్చుందుకు వెళ్లనీయకుండా అడ్డుకున్న విద్యుత్ తీగలు తమను ఇబ్బందిపెట్టినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. కాగా మంటల ధాటికి పరిశ్రమకు ఓ వైపు గోడ కూడా కూలిపోయిందని తెలిపారు. సీనియర్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అమర్ జిల్ సింగ్ బెయిన్స్ ఘటనాస్థలాన్ని సందర్శించి.. భవనం పూర్తిగా కుప్పకూలే ప్రమాదం కూడా వుందని.. పరిసర ప్రాంతాల వారినీ కూడా ఖాళీ చేయాల్సిందింగా అదేశాలిచ్చారు. అగ్నిమాపక దాళాలు సరైన సమయంలో స్పందించకపోవడం వల్లే ఈ ప్రమాద తీవ్రత పెరిగిందని భవన యజమానులు అరోపిస్తుండగా, ఈ పరిశ్రమలను జనవాసాల నుంచి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles