Student Attack Teacher With knife In Haryana. టీచర్ పై దాడి.. విద్యార్థుల్లో పెరుగుతున్న నేరప్రవృత్తి..

Student attack teacher with sharp weapons in class room in haryana

Haryana, Student stabs teacher, Haryana police, Haryana news, Class Room, class 12 student, teacher attack, viral video

A Class 12 boy studying at a private school in Bahadurgarh town of Haryana’s Jhajjar district brutally stabbed his mathematics teacher multiple times.

ITEMVIDEOS: టీచర్ పై దాడి.. విద్యార్థుల్లో పెరుగుతున్న నేరప్రవృత్తి..

Posted: 10/14/2017 05:46 PM IST
Student attack teacher with sharp weapons in class room in haryana

విద్యార్థులలో నేరప్రవృత్తి పెరుగుతూ పోతుందని చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ, గతంలో విద్యార్థుల మధ్య వివాదాలు వచ్చి ఒకరొపై మరోకరు దాడుల చేసుకునే స్థాయి దాటి ఏకంగా తమకు తక్కువ మార్కులు వేశారన్న కోపంతో మాస్టార్లపైనే దాడులకు తెగబడుతున్నారు, హర్యానాలోని ఝజ్జర్ జిల్లా నజఫ్ గడ్ రోడ్డులో ఉన్న హర్దయాల్ పబ్లిక్ స్కూల్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. తరగతి గదిలో పేపర్లు దిద్దుకుంటున్న ఉపాధ్యాయుడిపై 12వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థి ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు.

తనతో పాటు ఇంటి నుంచి తెచ్చుకున్న బ్యాగులో అప్పటివరకూ దాచుకున్న ఆయుధంతో ఒక్కసారిగా దాడి చేశాడు.  ఊహించని ఆ పరిణామానికి బిత్తరపోయిన ఆ టీచర్‌ ప్రతిఘటించలేక బయటకు పరిగెత్తాడు. అయినా వదలని ఆ విద్యార్థి వెంటపడి గాయపరచసాగాడు. ఇంతలో మరో టీచర్‌ వచ్చి బెదిరించటంతో కాస్త వెనక్కి తగ్గిన ఆ విద్యార్థిని ఇతర విద్యార్థుల సాయంతో  కట్టడి చేయగలిగారు.

పరీక్షలో తక్కువ మార్కులు వేయటంతోపాటు.. అందరి ముందు తిట్టాడన్న కోపంతోనే ఈ స్టూడెంట్‌ ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. దీనికిగానూ మరో విద్యార్థి కూడా సహకరించటంతో పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. తలపై తీవ్ర గాయాలు కావటంతో టీచర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై ఆందోళన వ్యక్తం చేసిన స్కూల్ యాజమాన్యం శనివారం పేరెంట్స్ మీటింగ్ ను ఏర్పాటు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : haryana. Class Room  teacher attack  class 12 student  viral video  crime  

Other Articles