Beer sales hit festive high in Telangana వర్షాకాలంలోనే.. బీరు కొరత.. భలేగా లాగించేస్తున్నారు..

Beer sales hit festive high in erstwhile telangana

beer, karnataka, tamil nadu, bewerage companies, excise department, andhra pradesh, Telangana, liquor, drunk and drives, summer, rainy season

Consumption of beer increased in the month of September, as indicated by a surge in sales registered in the erstwhile Telangana

వర్షాకాలంలోనే.. బీరు కొరత.. భలేగా లాగించేస్తున్నారు..

Posted: 10/14/2017 04:01 PM IST
Beer sales hit festive high in erstwhile telangana

అమెరికాలో ఓ రాష్ట్రంలో ప్రభుత్వం అనుమతిపోందిన దుకాణాలలోన్నే గంజాయి లభ్యం కాకపోవడంతో అక్కడ ఎమర్జెన్సీ విధించారంటే నమ్మశక్యంగా లేనట్లే.. మన రాష్ట్రంలోని బీరు బాబులు గుటకేయడంలో దిట్టలుగా తయారవుతుండటంతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మాత్రం పక్క రాష్ట్రాలకు పరుగులు తీస్తుంది. ఎందుకంటే బీరుబాబులు శృతిమించి లాగించేస్తున్నారు. బీరు బాబులు వర్షాకాలంలోనే ఇలా తాగేస్తే.. ఇక వేసవి కాలంలో ఎంత లాగించేస్తారో అర్థంకాకు.. ముందస్తు ప్రణాళికలకు రెడీ అవుతుంది ఎక్సైజ్ శాఖ.

తాజాగా వెల్లడవుతున్న గణంకాలే ఈ విషయాన్ని నిర్థారిస్తున్నాయి. మన రాష్ట్రంలోని బీరు బాబుల తాకిడిని బీరు కంపెనీలే తట్టుకోలేక పోతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఎకంగా మన రాష్ట్రంలోని నిల్వలన్నింటినీ ఖాళీ చేయడంతో.. ఎక్సైజ్ అధికారులు పొరుగు రాష్ట్రాలకు పరుగులు తీసి బీరు అర్డర్లను తెప్పించుకుంటున్నాయి. అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి వచ్చిన కొత్త మద్యం పాలసీ వచ్చిన తర్వాత అమ్మకాలు మరింత పెరిగాయి. మరో మూడు రోజులకు సరిపడ మాత్రమే బీరు నిల్వలు ఉన్నాయని..

దీంతో పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నామని అధికారులు తెలిపారు. తాజాగా నాలుగు లక్షల కేసుల బీర్లకు ఆర్డర్ ఇచ్చారు. సాధారణంగా వేసవిలో బీరు అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ సారి మాత్రం వర్షాకాలంలోనే బీరు కోరత ఏర్పడింది. గతేడాది కన్నా ఈ పక్షం రోజుల్లో 27.15 శాతం వృద్ది నమోదైందని.. సగటున రోజుకు 12 లక్షల బీర్ల చొప్పున అమ్ముతున్నారు. గతంలో వేసవిలో మాత్రమే ఇతర రాష్ట్రాల నుంచి ఏడెనిమిది లక్షల కేసుల బీర్లు దిగుమతులు జరిగేవి.

అయితే ఈసారి వర్షాకాలంలోనే నాలుగు లక్షల కేసుల బీర్లు దిగుమతి చేసుకుంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో మద్యం అమ్మకాల్లో తెలంగాణ ముందుంది. గత ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య కాలంలో రాష్ట్రంలో రూ.6,724.82 కోట్ల అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది ఇదే కాలంలో 20.80 శాతం పెరిగి రూ.8,123.55 కోట్లకు అమ్మకాలు చేరుకున్నాయి. తెలంగాణ తర్వాతి స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఇదే సమయంలో అమ్మకాలు 13.67 శాతం చొప్పున పెరిగాయి. తాగకండీ బాబు అంటే.. ఎక్సైజ్ శాఖ మాత్రం బీరు బాబులం మేము బీరుబాటులం అంటూ ప్లేబాక్ సాంగేసి మారీ తాగించేస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beer  karnataka  tamil nadu  bewerage companies  excise department  andhra pradesh  Telangana  liquor  

Other Articles