farmer writes to modi to give atleast RS 5 lakh నల్లధనంలో తనవాటా ఇవ్వాలని ప్రధానికి రైతు లేఖ

Kerala farmer writes to pm modi for black money share

Narendra Modi, Wayanad, black money, farmer, kerala farmer, election promise, BJP, farmer letter to modi, K Chathu, kerala farmer letter to modi black momey, kerala farmer Rs 5 lakh black money letter, cpi, cpm, congress, rahul gandhi

Wayanad-based farmer has written to PM Modi seeking his share from the promised black money hunt. K Chathu, a farmer hailing from Mananthavady, has urged the Prime Minister to deposit at least Rs 5 lakh in his account to help him survive the crop loss.

నల్లధనంలో తనవాటా ఇవ్వాలని ప్రధానికి రైతు లేఖ

Posted: 10/14/2017 09:40 AM IST
Kerala farmer writes to pm modi for black money share

గత ఎన్నికలకు ముందు దేశ, విదేశాలలో దాగివున్న నల్లధనాన్ని వంద రోజుల వ్యవధిలో దేశానికి రప్పించి.. దానిని దేశంలోని పేదవాళ్లందరి బ్యాంకు అకౌంట్లలో వేస్తానని చెప్పిన ప్రధాని మోడీకి కేరళకు చెందిన ఓ రైతు షాక్ ఇచ్చాడు. ప్రధాని మోదీ ఎన్నికల బాధ్యతలను చేపట్టి సుమారు వెయ్యి రోజులు దాటి కూడా వంద రోజులు పూర్తి చేసుకున్నా తమకు రావాల్సిన డబ్బు తమ అకౌంట్లలోకి రాలేదని భావించిన రైతు ఏకంగా ప్రధాని నరేంద్రమోడీకి లేఖను ఎక్కుపెట్టారు. నల్లధనంలో తనకు రావాల్సిన వాటా తనకు కేటాయించాలని కోరుతూ లేఖను సంధించారు.

ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న నల్లధనంలో తన వాటాగా రావాల్సిన రూ.15 లక్షలలో కనీసం రూ.5 లక్షలైనా తనకు ఇవ్వాలని కేరళకు చెందిన ఓ రైతు ప్రధాని మోదీకి లేఖ రాశాడు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరాడు. నిత్యావసరాల ధరలు పెరుగుతుండడంతో బతుకు దుర్భరంగా మారుతోందని, కాబట్టి ఇచ్చిన హామీ ప్రకారం ప్రస్తుతం రూ.5 లక్షలు తన ఖాతాలో వేయాలని కోరాడు.

వయనాడ్‌కు చెందిన కె.చాతు (68) ప్రధానికి లేఖ రాస్తూ.. ‘‘దేశవిదేశాల్లో అక్రమార్కులు దాచుకున్న నల్ల ధనాన్ని స్వాధీనం చేసుకుంటానని ఎన్నికల సమయంలో మీరు వాగ్దానం చేశారు. ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తాను అని హామీ ఇచ్చారు. మీరు అధికారంలోకి వచ్చి మూడేళ్లు అయింది. అయినా హామీ అలానే ఉంది. స్వాధీనం చేసుకున్న సొమ్ములో నా వాటా ధనాన్ని ఇవ్వండి. ప్రస్తుతానికైతే ఓ రూ.5 లక్షలు నా ఖాతాలో జమ చేయండి’’ అని వేడుకుంటూ తన ఖాతా నంబరును కూడా పేర్కొన్నాడు.

మాజీ మావోయిస్టు అయిన చాతు గతంలో సినీ నటుడు మమ్ముట్టికి వ్యతిరేకంగా కోర్టుకెక్కాడు. అప్పట్లో ఓ సబ్బుల కంపెనీకి ఆయన ప్రచారం చేశారు. అయితే ఆ సబ్బును తాను నెల రోజులు వాడినా తెల్లబడలేదంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తనకు నష్టపరిహారంగా రూ.50 వేలు ఇప్పించాలని కోరాడు. దీంతో దిగొచ్చిన సబ్బుల కంపెనీ చాతుకు రూ.30 వేలు చెల్లించి సమస్యను పరిష్కరించుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  Wayanad  black money  farmer  kerala farmer  election promise  BJP  

Other Articles