No corruption in Jay Shah's company: amit shah రూ.80కోట్ల టర్నోవర్ వున్నా కోటిన్నర నష్టం: అమిత్ షా

No question of corruption in son jay shah s company says amit shah

Jay Shah, Amit Shah, Amit Shahs Son, BJP Chief Amit Shah, Jay shah company, Jay shah corruption, BJP, latest news

Amit Shah today responded to allegations that his son Jay Shah, an entrepreneur, enjoyed a big upswing in his business after the BJP came to power in 2014.

రూ.80కోట్ల టర్నోవర్ వున్నా కోటిన్నర నష్టం: అమిత్ షా

Posted: 10/13/2017 05:47 PM IST
No question of corruption in son jay shah s company says amit shah

బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన తనయుడి జే షా కంపెనీపై వస్తున్న అరోపణలపై ఎట్టకేలకు స్పందించారు. కేంద్రంలో బీజేపి అధికారంలోకి వచ్చిన తరువాత తన కుమారుడి కంపెనీ ఏకంగా 16 వేల రెట్లు టర్నోవర్ సాధించిందని ది వైర్ వెబ్ పోర్టల్ ప్రచురించిన కథనంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన కుమారుడి కంపెనీలో అవినీతికి అస్కారమే లేదని స్పష్టం చేశారు. అవినీతికి పాల్పడినట్లు తగిన ఆధారాలు ఉంటే కోర్టుకు వెళ్లమని సూచించారు.

తన తనయుడి పేరిట వున్న కంపెనీలు ఏవీ కూడా ఒక్క రూపాయి మేర కూడా అవినీతి వ్యాపారానికి పాల్పడలేదని చెప్పారు. ఆ కంపెనీకి ప్రభుత్వం నుంచి ఎలాంటి లాభాలు దక్కలేదని చెప్పారు. బోఫోర్స్ కేసులో కాంగ్రెస్ పార్టీకి లభించినట్లు తెరవెనుకగా ఎలాంటి మూటలు కూడా లభించలేదని ఆయన చెప్పారు. పీకల్లోతు అవినీతి, అక్రమాల కేసుల్లో కూరుకుపోయిన కాంగ్రెస్.. తమపై వచ్చిన ఏ ఒక్క కేసు విషయంలోనైనా న్యాయపోరాటం చేసిందా..? అని నిలదీశారు.

కాంగ్రెస్‌ చేయని పనిని తన తనయుడు చేశారని, ది వైర్ వెబ్ సైట్ ప్రచురించిన కథనంపై క్రిమినల్ కేసుతో పాటు పరువు నష్టం కింద రూ.100కోట్ల దావా కూడా వేశాడని, ఇలా కేసులు వేయాలంటే వాటిని ఎదుర్కొనే ధైర్యం కూడా వుండాలని అన్నారు. జేషా అవినీతి ఆరోపణలపై మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? అయితే.. కోర్టుకు వెళ్లండి’ అని అమిత్‌ షా అన్నారు. కాంగ్రెస్ నేతలు అరోపణలు చేస్తున్నట్లుగా వారి వద్ద అధారాలుంటే న్యాయస్థానంలో కేసులు వేయాలని ఆయన సూచించారు.

జేషా వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాల్సిందిగా కాంగ్రెస్ డిమాండ్ చేస్తుండటంపై ఆయన ఈ విధంగా స్పందించారు. బీజేపి అధికారంలోకి వచ్చాక తన తనయుడి సంస్థ ఆదాయం 16వేల రెట్లు పెరిగిందని కథనాన్ని ఆయన తప్పుబట్టారు. తన తనయుడు చేసే వ్యాపారంలో టర్నోవర్ ను బట్టి లాభాలు వుంటాయని అనుకోవడం తప్పన్నారు. రూ. 80 కోట్ల మేర టర్నోవర్ సాధించినప్పటికీ తన తనయుడి సంస్థ కోటిన్నర రూపాయల నష్టాన్ని ఎదుర్కోందని చెప్పారు. టర్నోవర్ అంటే లాభం అన్న అర్థం వచ్చేలా కథనాలు ప్రచురించినందుకే దావా వేశామని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles