jeevitha responds on actor rajasekhar car accident రాజశేఖర్ కు ఎం జరగలేదు.. అభిమానానికి థ్యాంక్స్: జీవిత

Jeevitha responds on actor rajasekhar car accident

bjp leader, actress jeevitha, fans, actor rajasekhar, car accident, rajasekhar car accident, rajasekhar jeevitha, pv expressway, crime

bjp leader and actress jeevitha thanks all the fans who responded on her husband and actor rajasekhar car accident on pv expressway

రాజశేఖర్ కు ఎం జరగలేదు.. అభిమానానికి థ్యాంక్స్: జీవిత

Posted: 10/09/2017 09:47 AM IST
Jeevitha responds on actor rajasekhar car accident

సినీ నటుడు రాజశేఖర్ కు తృటిలో ప్రమాదం తప్పించుకున్న నేపథ్యంలో అతని భార్య సినీనటి, బీజేపి నాయకురాలు జీవిత స్పందిస్తూ.. తన భర్తకు ప్రమాదంలో ఎలాంటి గాయాలు కాలేదని, దీంతో అభిమానులెవరూ అందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తమ అభిమాన హీరోకు ఏం జరిగిందోనన్న అందోళనతో ఎంతో మంది ఫ్యాన్స్ రాజశేఖర్ క్షేమ సమాచారాలను తెలుసుకునేందుకు ఫోన్ చేస్తున్నారని చెప్పిన అమె తమ కుటుంబంపై ఉన్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇది చిన్న ప్రమాదమని, రెండు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయనే తప్ప ఈ ఘటనలో ఎవరికీ ఏమీ జరగలేదని అమె చెప్పుకోచ్చారు. పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ పరీక్షల్లో తన భర్త మద్యం తాగలేదనే తేలిందని గుర్తు చేసిన జీవిత, గత కొంత కాలంలో ఆయన మనసు బాగాలేదని, ఏదో ఆలోచిస్తూ వాహనాన్ని నడిపినందునే ప్రమాదం జరిగిందని చెప్పారు. ఇకపై ఇటువంటి ఘటనలను జరగనీయబోనని, తన భర్త ఒంటరిగా వాహనం నడిపేందుకు అంగీకరించనని తెలిపారు. కేసు సమసిపోయినందున మీడియా కూడా సంయమనంతో వ్యవహరించాలని అన్నారు.

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో పీవీ ఎక్స్ ప్రెస్ వేపై వెళ్తున్న మరో కారును వెనుక నుంచి ఢీ కొంది. దీంతో ముందు కారులో ఉన్న రామిరెడ్డికి, రాజేశేఖర్ మద్య వాగ్వాదం రేగింది. ఇద్దరూ ఒకరిపైమరొకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. అయితే రాజశేఖర్ తల్లి చనిపోయిన డిప్రేషన్ లో కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెప్పారు. ఇద్దరూ కాంప్రమైజ్ కావడంతో ఇద్దరు ఫిటిషన్ వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. తర్వాత  రాజశేఖర్ కు బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు అతను మద్యం సేవించలేదని నిర్ధారించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bjp leader  actress jeevitha  fans  actor rajasekhar  car accident  pv expressway  tollywood  crime  

Other Articles