piramal swasthya employees allege of management warnigs చంద్రన్న రాజ్యం.. ప్రైవేటు బోజ్యం.. కార్మికులపై జులుం

Piramal swasthya employees allege of management warnigs

104 services, media, management warning, employees, medical sevices, government scheme, rural habitats, medicines, chandrababu, Andhra Pradesh, piramal swasthya, sanchara chikithsa, latest news

The Rural medical sevices wing 104 (sanchara chikithsa) employees allege that management piramal swasthya warned them of letting the loop holes to media

చంద్రన్న రాజ్యం.. ప్రైవేటు బోజ్యం.. కార్మికులపై జులుం

Posted: 10/06/2017 11:18 AM IST
Piramal swasthya employees allege of management warnigs

అవినీతి, అక్రమాలు ఎక్కడవున్నా.. వాటిని సమూలంగా నిర్మూలించేందుకు తాను ఎంతటి ఉద్యమానికైనా సిద్దమని గత ఎన్నికలకు ముందు పల్లె పల్లె తిరిగి చెప్పిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు, అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న అవినీతిపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారా..? అంటే అవునన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకు చంద్రన్న సంచార చికిత్స (104 వాహనాలు) ఓ ఉదహారణగా నిలుస్తుంది. చంద్రన్న రాజ్యంలో ప్రైవేటు సంస్థల బోజ్యం నడుస్తుందని.. లాభాపేక్ష లేని సంస్థలు.. లాభార్జనకు పూనుకుంటున్నాయని అరోపణలు వినిపిస్తున్నాయి.

చంద్రన్న సంచార చికిత్స పగ్గాలు గత రెండేళ్లుగా ఓ ప్రైవేటు సంస్థ నిర్వహిస్తుంది. అయితే ఇది లాభాపేక్ష్ లేని సంస్థగా గుర్తింపుపోందినా.. వాస్తవానికి జరుగుతున్నది మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వుందని సంస్థ ఉద్యోగులు అరోపిస్తున్నారు. తాము మీడియాను ఆశ్రయించి తమ న్యాయమైన కోర్కెలను తీర్చాలని డిమాండ్ చేసినా.. ఈ సంచార చికిత్సలోని లోటుపాట్లను, లోసుగులను మీడియా దృష్టికి తీసుకెళ్లినా తమపై కఠిన చర్యలు తీసుకుంటామని యాజమాన్యం హెచ్చరిస్తుందని ఉద్యోగులు అరోపించారు. తమ గోడును వెల్లబోసుకునేందుకు కూడా తమకు అవకాశమివ్వకుండా బెదిరింపులకు పాల్పడటం ఏంటిన ప్రశ్నిస్తున్నారు.

సంచార చికిత్సలో మందుల కొరత, ఉద్యోగులకు సమన్యాయం, కోర్కెలు, డిమాండ్లపైగానీ ఉద్యోగులెవరైనా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను అశ్రయిస్తే వేటు పడుతుందని హెచ్చరించినట్లు ఉద్యోగులు అరోపిస్తున్నారు. ఈమేరకు అంతర్గత ఉత్తర్వులు జారీచేసిందని కూడా చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఈ సేవలను ప్రారంభించింది. అయితే అప్పటి నుంచి ప్రభుత్వమే ఈ నిర్వహణ బాధ్యతలను చేపట్టగా.. రెండేళ్ల క్రితం నుంచి ఈ నిర్వహణా బాద్యతను పిరమిల్‌ స్వాస్థ్య అనే ప్రైవేటు సంస్థకు అప్పగించింది. అప్పట్నుంచీ ఈ వాహనాల్లో మందులు తగ్గిపోయాయి. కనీసం 60 రకాల మందులు ఉండాల్సి ఉంది. కానీ 15 నుంచి 18 రకాల మందులు లేవు. రక్తపరీక్షలు జరగడం లేదు. దీంతో 104 సిబ్బందిపై గ్రామీణ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు.

మీడియాను అశ్రయించి సిబ్బందిపై నిర్వహణ సంస్థ బెదిరింపులకు పాల్పడుతోందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసులు పెట్టడం, బదిలీలు చేయడం లాంటివి చేస్తున్నారని, నాలుగేళ్ల నుంచి వేతనాలు పెంచడం లేదని, సమాన పనికి సమానవేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్పినా పిరమిల్‌ స్వాస్థ్య సంస్థ పట్టించుకోవడం లేదని ఉద్యోగులు మీడియాకు చెబుతున్నారు. ఓవైపు నిర్వహణ సంస్థ ఇన్నిరకాలుగా పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నట్టు ప్రభుత్వానికి ఫిర్యాదులందుతున్నా కనీసం కూడా పట్టించుకోవడం లేదు. ఒక్కో వాహనానికి నెలకు రూ.2.42 లక్షలు ఇస్తున్నా కనీసం మందులు ఇవ్వకపోగా సిబ్బందిని బెదిరిస్తున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామీణ పేదల సంచార చికిత్సపై దృష్టిసారించి చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 104 services  media  warnings  employees  piramal swasthya  sanchara chikithsa  chandrababu  Andhra Pradesh  

Other Articles