TBGKS posts big win in Singareni polls గనుల్లో మరింతగా ప్రతిధ్వినించిన ’కారు‘గర్జన

Trs affiliate tbgks wins singareni trade union elections

TBGKS, Singareni collieries, Union Polls, TBGKS, Singareni Elections, SCCL, Telangana

The Telangana Boggu Ghani Karmika Sangham (TBGKS) affiliated to the TRS has won in the most of the units like Yellandu, Kothagudem and Bellampally corporate for the union elections in Singareni Collieries Coal Limited

గనుల్లో మరింతగా ప్రతిధ్వినించిన ’కారు‘గర్జన

Posted: 10/06/2017 10:48 AM IST
Trs affiliate tbgks wins singareni trade union elections

సింగరేణి యాజమాన్యం అధికార గుర్తింపు సంఘం కోసం జరిగిన ఎన్నికలలో గనుల్లో అధికార పార్టీ మరోమారు తన సత్తాను చాటడంతో ‘కారు’గర్జన మునపటికంటే అధికంగా ప్రతిధ్వినించింది. రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్ మరోసారి విజయం సాధించింది. గత ఎన్నికల్లో 6 ఏరియాల్లో మాత్రమే గెలిచిన టీబీజీకేఎస్ .. ఈసారి ఏకంగా 9 చోట్ల గెలిచి సత్తా చాటింది. మిగిలిన రెండు ఏరియాల్లో ఏఐటీయూసీ గెలిచింది. 6 జిల్లాల పరిధిలోని 11 ఏరియాల్లో జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో 49 వేల 873 మంది కార్మికులు ఓట్లు వేశారు.

94. 93 శాతం ఓటింగ్ నమోదుకాగా, ఇల్లెందు, మణుగూరు, బెల్లంపల్లి, కార్పొరేటు ఆఫీసు, శ్రీరాంపూర్, కొత్తగూడెం, రామగుండం 1, 2, 3 డివిజన్లలో టీబీజీకేఎస్ జయకేతనం ఎగురవేసింది. ఈ ఎన్నికల్లో 15 కార్మిక సంఘాలు పోటీ చేశాయి. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, టీడీపీ అనుబంధ సంస్థ కలిసి బరిలోకి దిగాయి. అయినా ఉద్యమ సమయంలో జరిగిన ఎన్నికల కంటే ఎక్కువ ఏరియాల్లో విజయం సాధించింది టీబీజీకేఎస్. మొత్తం 11 ఏరియాలకు గానూ టీబీజీకేఎస్ 9 చోట్ల, ఏఐటీయూసీ రెండు చోట్ల విజయం సాధించాయి.

ఏరియాల వారీగా విజయం

కొత్తగూడెం కార్పొరేట్‌ ఏరియాలో 544 ఓట్ల తేడాతో టీబీజీకేఎస్‌ విజయం

ఇల్లెందు ఏరియాలో టీబీజీకేఎస్‌కు 217 ఓట్ల మెజార్టీతో గెలుపు

మణుగూరులో 631 ఓట్లతో టీబీజీకేఎస్‌ విన్

బెల్లంపల్లిలో 174 ఓట్లతో టీబీజీకేఎస్‌ విజయం

కొత్తగూడెం ఏరియాలో టీబీజీకేఎస్‌ కు 771 ఓట్ల మోజారిటీ

శ్రీరాంపూర్‌లో టీబీజీకేఎస్‌ 2,215 ఓట్లతొ విజయదుందుబి

మందమర్రి ఏరియాలో ఏఐటీయూసీ  800 విజయం

భూపాలపల్లిలో ఏఐటీయూసీ 936 ఓట్ల మెజార్టీతో గెలుపు

రామగుండం–1లో టీబీజీకేఎస్‌ 366 ఓట్ల మెజార్టీతో విజయం.

రామగుండం–2లో టీబీజీకేఎస్‌ 764 ఓట్ల మెజార్టీతో గెలువు

రామగుండం–3లో ఏఐటీయూసీ 226 ఓట్ల ఆధిక్యంతో విజయం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TBGKS  Singareni collieries  Union Polls  TBGKS  Singareni Elections  SCCL  Telangana  

Other Articles