RBI lowers growth forecast వార్షిక వృద్ధి రేటు అంచనాలో కోత.. అంచనా తారుమారు..

Rbi keeps repo rate unchanged at 6 on back of rising inflation

RBI Policy, RBI, monetary policy committee, Inflation, Repo rate, reserve bank of india, Assocham, RBI govorner, Urjit Patel

The RBI kept the key interest rates unchanged, as was widely expected. Which also cut the economic growth forecast for the current fiscal to 6.7 per cent from earlier projections of 7.3 per cent.

వార్షిక వృద్ధి రేటు అంచనాలో కోత.. వడ్డీ రేట్లు యథాతథం

Posted: 10/04/2017 03:45 PM IST
Rbi keeps repo rate unchanged at 6 on back of rising inflation

భారతీయ రిజర్వు బ్యాంకు నాలుగో ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష నేపథ్యంలో అర్థిక రంగ నిపుణుల, మార్కెట్ వర్గాల అంచనాలే నిజమయ్యాయి. దేశ ఆర్థికాభివృద్ధి మందగిస్తున్న అర్థిక రంగ నిపుణులు, విశ్లేషకుల అంచనాలతో అర్బీఐ కూడా అంగీకరించింది. దేశ వృద్ది రేటు నెమ్మదిస్తుందనేందుకు సంకేతంగా అంచనాలను సవరించింది. అనుకున్నంత మేర వృద్ది రేటు నమోదు కాదని తాజాగా తమ అంచనాలను సవరించింది.

ఈ నేపథ్యంలో క్రమంగా ద్రవ్యోల్భణం కూడా పెరుగుతున్నందున ఇవాళ నాలుగో ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షను నిర్వహించిన అర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులకు పూనుకోలేదు. ఈ క్రమంలో విశ్లేషకుల అంచనాలకు తగ్గట్టుగా వడ్డీ రేట్లలో రెపో రేటు, రివర్స్ రెపో రేటు, సీఆర్ఆర్ లలో ఎలాంటి తేడాలు లేవని స్పష్టం చేస్తూ యథాతథంగానే కొనసాగించనున్నట్లు ప్రకటించింది.

ఉర్జీత్ పటేల్ అధ్వర్యంలోని ద్రవ్యపరపతి విధాన సమీక్షా కమిటీ రెపోెరేటును యథాతథంగా ఆరుశాతం కోనసాగించాలని నిర్ణయించింది. రివర్స్‌ రెపో రేటు, సీఆర్‌ఆర్‌లలో కూడా ఎలాంటి మార్పులు చేయకుండా 5.75శాతం, 4శాతంగా ఉంచారు. అయితే ఎస్ఎల్ఆర్ ను మాత్రం 50 బేసిస్ పాయింట్లు తగ్గించి 19.5శాతానికి కుదించారు. ఈ ఆర్థిక సంవత్సరం వృధ్దిరేటు మరింత తక్కువగా నమోదవుతుందని అర్బీఐ అంచనా వేసింది. గతంలో 7.2గా అంచనా వేయగా, ఈ సారి మాత్రం అది 6.7గా నమోదవుతుందని అంచనాను సవరించింది. ఇక ద్రవ్యోల్భణం మాత్రం 4.2 నుంచి 4.6శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles