No Service Charge on e-tickets till March 2018 మార్చి వరకూ మినహాయింపు.. రైల్వే తీపికబురు..

No service charge on train e tickets till march 2018 railways

demonetisation, indian railways, IRCTC, Online Booking, e-tickets, rail, Railway board, railways revenue, train e-tickets, service charge, train ticket booking, online train tickets

In a good news for rail passengers, they will enjoy service charge exemption on tickets booked online till March 2018.

మార్చి వరకూ మినహాయింపు.. రైల్వే తీపికబురు..

Posted: 10/04/2017 02:50 PM IST
No service charge on train e tickets till march 2018 railways

ప్రయాణికులకు మరోసారి రైల్వే శాఖ తీపి కబురును అందించింది. ఆన్ లైన్ లో కొనుగోలు చేసే రైల్వే ఈ-టికెట్లపై సేవా రుసుము మినహాయింపును మరో అరు నెలల వరకు పొడగించింది. దీంతో వచ్చే ఏడాది మార్చి చివరి వరకు సర్వీసు చార్జీ మినహాయింపు లేకుండా అన్ లైన్ లో టికెట్లను పొందే అవకాశం ప్రయాణికులకు అందింది. గత ఏడాది నవంబర్ మాసంలో పాత పెద్దనోట్ల రద్దు తర్వాత నగదు లావాదేవీలను తగ్గుముఖం పట్టించి, డిజిటల్ లావాదేవీలను ప్రేరేపించడంలో భాగంగా ఈ మినహాయింపును తొలిసారిగా ప్రయాణికులకు కల్పించింది రైల్వేశాఖ.

ఆన్‌లైన్‌ లో ఈ–టికెట్లపై సేవా రుసుముకు కేంద్రం తాత్కాలికంగా మినహాయింపు ప్రకటించింది. తొలుత ఈ మినహాయింపును ఈ ఏడాది మార్చి వరకు ప్రకటించిన రైల్వే శాఖ ఆ తరువాత దానిని మరో అరు మాసాలు పెంచుతూ సెప్టెంబర్ 30 వరకు పొడగించింది. సెప్టెంబర్ 30 కూడా దాటిపోవడంతో.. తాజాగా ఈ మినహాయింపును 2018 మార్చి 31వరకు పెంచుతూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. ఐఆర్సీటీసీ ద్వారా ఆన్ లైన్ లో బుక్‌ చేసే రైలు టికెట్లపై రూ.20 నుంచి రూ.40 వరకు గతంలో సేవా రుసుం వసూలు చేసింది.

కాగా మార్చి 2018 వరకు ఈ డిజిటల్ మినహాయింపుకు కల్సించినట్లు ప్రకటించి రైల్వే శాఖ తమ ప్రయాణికులకు తీపికబరును అందించింది. దీంతో ప్రయాణికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతేడాది ఐఆర్సీటీసీకి టికెట్ల అమ్మకంతో రూ.1500 కోట్ల ఆదాయం రాగా దీనిలో రూ.540 కోట్లు కేవలం సేవా రుసుముల ద్వారా వచ్చింది. 2016 నవంబరు 23 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 27 వరకు ప్రయాణికుల నుంచి సేవా రుసుం, సేవా పన్ను రూపంలో రూ.184 కోట్లు వసూలు చేయకుండా వదిలేసినట్లు రైల్వే గణాంకాలు వెల్లడించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles